Nalimela Bhaskar Select for Kaloji Award : ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024 కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సాహితీ పురస్కారం అందిస్తోంది. ఈ ఏడాది అవార్డు గ్రహీత ఎంపిక కోసం ప్రభుత్వం ప్రముఖ కవి అందెశ్రీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2024 కాళోజీ పురస్కారానికి నలిమెల భాస్కర్‌ను ఎంపిక చేసింది. ఈ నెల తొమ్మిదో తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. నలిమెల భాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సన్మానించి 1,01,116 రూపాయల పురస్కారాన్ని అందిస్తారు.
బహుభాషా కోవిదుడు : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాస్కర్‌కు 14 భాషల్లో పట్టుంది. తెలుగు అధ్యాపకులుగా పనిచేసి 2011లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, సుద్దముక్క వంటి సంకలనాలను ఆవిష్కరించారు. పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించడంతో పాటు తెలంగాణ పదకోశాన్ని రూపొందించారు. మలయాళ నవల స్మారక శిశిగల్‌ను తెలుగులోకి స్మారక శిలలు పేరిట అనువదించారు. ఈ పుస్తకానికి 2013లో అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది.
వరద బాధితులకు విరాళాలు వెల్లువ - జీఎంఆర్ సంస్థ భారీ సాయం - Floods Donors In Telangana