Multipurpose Industrial Park in Vikarabad : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో బహుళార్థ పారిశ్రామిక పార్కు భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈక్రమంలో దుద్యాల మండలంలోని లగచర్లలో 110 ఎకరాల 32 గుంటలు, పోలేపల్లిలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. లగచర్లలో రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఇటీవల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గతంలో దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలెపల్లి గ్రామాల్లో ఫార్మావిలేజ్ కోసం 1538 ఎకరాల భూసేకరణ కోసం నోటిపిషన్ జారీ చేసిన సర్కారు ఉద్రిక్తతల నేపథ్యంలో వెనక్కి తగ్గింది.
కాలుష్యం లేని పరిశ్రమలకే ప్రాధాన్యత : ఫార్మా విలేజ్కు బదులుగా తాజాగా మల్టిపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూములు సేకరించనుంది. కాలుష్యకారక ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వబోమని ఆయా గ్రామాల రైతులు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాలుష్యం లేని, పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకే పారిశ్రామిక వాడ ఏర్పాటులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమల ఏర్పాటు ద్వారా కరవు పీడిత ప్రాంతమైన కొడంగల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కాంగ్రెస్ సర్కారు యోచిస్తోంది.
లగచర్ల వాసులకు గుడ్న్యూస్ - భూసేకరణ నోటిఫికేషన్ ఉప సంహరణ
'లగచర్ల' ఘటనలో కీలక మలుపు - లొంగిపోయిన ప్రధాన నిందితుడు సురేశ్