ETV Bharat / state

కాసులు కురిపిస్తున్న మల్బరీ సాగు - నెలకు లక్ష రూపాయల ఆదాయం - Mulberry Cultivation in Siddipet - MULBERRY CULTIVATION IN SIDDIPET

Mulberry Cultivation in Siddipet : పెట్టుబడికి తగ్గట్టుగా దిగుబడి వస్తేనే అన్నదాతకు ఆనందం. అలాంటిది పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువగా ఉంటే రైతుల సంతోషానికి అవధులు ఉండవు. సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్‌ రైతులు మల్బరీ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. నెలకు లక్ష రూపాయలు ఆర్జిస్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పోటీ పడుతున్నారు. ఒక్కసారి మల్బరీ సాగు చేస్తే ఏడాది పొడవునా దిగుబడి సాధించవచ్చని చెబుతున్నారు.

Farmers Success In Mulberry Cultivation
Farmers Success In Mulberry Cultivation
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 30, 2024, 1:56 PM IST

Updated : Mar 30, 2024, 8:44 PM IST

మల్బరీతో లక్ష 'పట్టు'- సాగు వైపు మొగ్గు చూపుతున్న రైతులు

Mulberry Cultivation in Siddipet : సెరీకల్చర్‌ సాగులో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో కేవలం 30 ఎకరాల నుంచి 50 ఎకరాల్లో మాత్రమే సాగు చేసేవారు. ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో((Govt Assistance) ) రాష్ట్రంలో 11 వందల 27 ఎకరాల్లో మల్బరీ సాగు జరుగుతోంది. పట్టు పురుగులనూ పెంచుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు.

Farmers Cultivating Mulberry : మిగిలిన పంటలకు భిన్నంగా మల్బరీ సాగు(Mulberry) ఉండటం రైతులకు కలిసి వస్తుంది. ప్రకృతి విపత్తులను తట్టుకుని ఈ పంట నిలుస్తుంది. మొక్క దశలో ఒకటి రెండు తడుల నీరు అందిస్తే సరిపోతుంది. ప్రతి రెండు వారాలకు ఈ మెుక్కలను కత్తిరించి పట్టుపురుగులకు ఆహారంగా వేస్తున్నారు. పట్టుపురుగులు ఎదిగి మంచి దిగుబడిని అందిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

"నేను మొదట్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగంలో వచ్చే జీతం అంతంత మాత్రమే ఉండటంతో ఈ సెరికల్చర్ సాగు చేయాలనుకున్నాను. యూట్యూబ్​లో ఈ సాగు గురించి కొన్ని వీడియోలు చూడటం ద్వారా కొంత అవగాహన కలిగింది. నాకు ఉన్నటువంటి కొంత భూమిలో ఈ సెరికల్చర్​ సాగును చేపట్టాను. సంవత్సరానికి సుమారు 10 పంటలు వస్తున్నాయి" - శ్రీనివాస్, సెరికల్చర్​ రైతు చంద్లాపూర్

నాగర్​కర్నూల్​ జిల్లాలో భారమై దూరమైతున్న మల్బరీ సాగు

లాభసాటిగా సెరీకల్చర్​ సాగు : ఏటికేడు రాష్ట్రంలో పట్టు రైతులు పెరుగుతున్నారు. సాధారణ పంటల్లో నష్టభయం ఉండటంతో మల్బరీ వైపు అడుగులు వేస్తున్నారు. షెడ్లు వేసుకోవడానికి, పురుగులు కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం రాయితీ(Subsidy) ఇస్తోంది. ప్రతి 21 రోజులకు ఒకసారి పంట చేతికి వస్తుంది. నెల నెల జీతం మాదిరిగానే పంట దిగుబడి వస్తుంది. 20 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కేవలం పట్టు పురుగులు కొనుగోళ్లకు మాత్రమే ఖర్చు అవుతుంది. సంప్రదాయ పంటలు కాకుండా విభిన్న పద్ధతుల్లో ప్రయత్నిస్తే లాభాలు గడించవచ్చని మల్బరీ రైతులు నిరూపిస్తున్నారు.

"తెలంగాణలో మల్బరీ సాగు రెండు రకాలుగా ఉంది. బైఓల్టిన్ పంట, దశలి పట్టు . ఈ దీని వ్యవస్థ మొత్తం నెల రోజులు. నెల రోజుల్లో దీనికి పని ఉండేది 21 రోజులు మాత్రమే. ఒక ఎకరానికి దాదాపు రెండో ఏడాది నుంచి రూ.50 వేలు నుంచి రూ.లక్ష లాభాలను ఆర్జిస్తున్నారు రైతులు." - ఇంద్రసేనారెడ్డి, సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్

Silkworms Price: రికార్డు స్థాయిలో పలికిన కిలో పట్టుగూళ్ల ధర

Silkworms: వరి బదులు పట్టు.. అన్నదాతలకు ఉద్యానశాఖ సలహా

Last Updated : Mar 30, 2024, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.