Mother Attempt to Kill her Daughter : నిజామాబాద్ ఎల్లమ్మగుట్టకు చెందిన సరితకు విడాకులయ్యాయి. సరితకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. విడాకుల అనంతరం అల్తాఫ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న మైనర్ బాలికను అడ్డు తొలగించుకోవాలని భావించారు. ప్రియుడు చెప్పిన ప్లాన్‌కు సరిత ఓకే చెప్పింది. మైనర్ బాలికను ఠాణాకలాన్, జాన్కంపేట్ శివారులోని నిజాంసాగర్ కెనాల్ వద్ద ఉన్న మల్లన్న గుడి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అల్తాఫ్ స్నేహితుడైన ఆటో డ్రైవర్ ఆరిఫ్ కూడా వచ్చాడు. అక్కడ బాలికను తీవ్రంగా గాయపర్చి, ఆ తర్వాత ఉరి వేశారు.
బాలిక చనిపోయిందని అనుకుని : చనిపోయిందని భావించి బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం అటుగా వెళ్లిన స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న బాలికను గుర్తించి ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న బాలికను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్స పొందుతున్న బాలిక స్పృహలోకి వచ్చాక చెప్పిన విషయాలతో తల్లి సరిత హత్య ప్రణాళిక బయటకు వచ్చింది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి చంపాలని అనుకున్నారని బాలిక పోలీసులకు తెలిపింది. చనిపోయానని అనుకోని వెళ్లిపోయారని చెప్పింది. బాలిక వాంగ్మూలంతో హత్యాయత్నంలో నిందితులైన సరిత, అల్తాఫ్, ఆటో డ్రైవర్ ఆరిఫ్‌ను ఎడపల్లి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బాలిక తమ్ముడిని పోలీసులు సదరం హోమ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం కోసం కుమార్తెను కడతేర్చాలని అనుకున్న కన్నతల్లిపై స్థానికులు మండిపడుతున్నారు. ఇటీవల కూడా వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని ఓ తల్లి తన సొంత బిడ్డను కడతేర్చింది. పాము కాటుతో తన బిడ్డ చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేయగా బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సినిమాను తలపించేలా హత్య - భర్తను చంపించిన భార్య - Wife Killed Husband In Nalgonda