ETV Bharat / state

ఏపీలో "లక్కీ భాస్కర్లు" - నకిలీ పత్రాలతో మార్టిగేజ్​ ఆస్తుల అమ్మకం - MORTGAGE LOAN FRAUDS IN AP

"మార్టిగేజ్ ఆస్తులూ అమ్మిపెట్టాలా? - మేమున్నాం కదా!" - ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్త దందా

Mortgage Loan Frauds in AP
Mortgage Loan Frauds in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 3:17 PM IST

Mortgage Loan Frauds in AP : బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్‌ కంపెనీల వద్ద తీసుకున్న రుణాల ఎగవేతకు అక్రమార్కులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కొందరు కేటుగాళ్లు బ్యాంకు మేనేజర్ల అవతారం ఎత్తి, గూడుపుఠాణి చేస్తున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులకు ముడుపులు ఇచ్చి అప్పులు చెల్లించకుండానే మార్ట్‌గేజ్‌ డీడ్‌ రిలీజ్‌ చేయిస్తున్నారు. ఆ తర్వాత ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, చివరకు ఆస్తులను విక్రయిస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలు ఏపీలో వెలుగులోకి వస్తున్నాయి.

ఏదైనా ఆస్తి తనఖా పెట్టుకున్నట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేస్తేనే మార్ట్‌గేజ్‌ రుణం మంజూరు చేస్తారు. ఆస్తిపత్రాలను బ్యాంకులోనే ఉంచుకుంటారు. తీసుకున్న అప్పు చెల్లించగానే బ్యాంకు మేనేజర్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి, బాకీ తీరినట్లు బ్యాంకుకు ఇచ్చిన పత్రాలు, ఆస్తి పత్రాలు సమర్పించి మార్ట్‌గేజ్‌ డీడ్‌ రిలీజ్‌ చేయిస్తారు. అప్పుడు ఈసీలో సైతం రుణం తీరినట్లు చూపిస్తుంది.

నకిలీ పత్రాలతో : ‘రుణాలు చెల్లించకుండానే ఇతర బ్యాంకుల్లో అప్పు ఇప్పిస్తామని, మీ ఆస్తులు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తామని’ అంటూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ముఠా బయల్దేరింది. బ్యాంకుల్లో బాకీలు తీసుకుని, కట్టలేక ఇబ్బంది పడుతున్న వారిని కొందరు లేఖర్లు, మధ్యవర్తుల ద్వారా గుర్తిస్తున్నారు. సంబంధిత బ్యాంకులు, సంస్థల నకిలీ లెటర్‌ హెడ్‌లు, స్టాంపులు సృష్టిస్తున్నారు. బ్యాంకు మేనేజర్ల అవతారంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి అప్పు తీరిపోయినట్లు పత్రాలు ఇచ్చి మార్ట్‌గేజ్‌ డీడ్‌ రిలీజ్‌ చేసేస్తున్నారు. దీంతో ఈసీలో ఎలాంటి రుణం లేనట్లు చూపిస్తోంది. ఒక్కో రుణానికి విలువను బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వీరు వసూలు చేస్తున్నారు.

కొన్ని ఉదాహరణలు..

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి విజయవాడలోని ఓ ఫైనాన్స్‌ సంస్థ వద్ద ఇల్లు తనఖా పెట్టారు. అక్కడ రూ.20 లక్షల అప్పు తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫైనాన్స్‌ సంస్థ మేనేజర్‌నంటూ ఓ వ్యక్తి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి ఆ రుణం తీరిపోయిందంటూ నకిలీ పత్రాలు చూపించి, మార్ట్‌గేజ్‌ డీడ్‌ రిలీజ్‌ (తనఖా చెల్లు రసీదు) చేయించారు. ఆ తర్వాత అదే ఇంటిపై మరో రెండు ఫైనాన్స్‌ సంస్థల్లో రూ.కోటి వరకు రుణం తీసుకున్నారు. వాటినీ ఇలాగే చెల్లించేసినట్లు చూపించి, మార్ట్‌గేజ్‌ డీడ్‌ రిలీజ్‌ చేయించుకున్నారు. తాజాగా ఆ ఇంటిని అమ్ముకుని చేతులు దులిపేసుకున్నారు.

ఏలూరు వాసి ఒకరు ప్రైవేట్ బ్యాంకులో ఇల్లు తనఖా పెట్టి రూ.21 లక్షలు రుణం తీసుకున్నారు. విజయవాడకు చెందిన ఓ ఫైనాన్స్‌ కంపెనీలో మరో ఇద్దరు రూ.17.5 లక్షల చొప్పున రుణాలు పొందారు. ఈ మూడు రుణాల మార్ట్‌గేజ్‌ రిలీజ్‌కు ఒకే వ్యక్తి వేర్వేరు సమయాల్లో ఏలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మేనేజరులా వచ్చారు. నకిలీ పత్రాలు సమర్పించి, తనఖా చెల్లు రసీదు పొందారు. ప్రస్తుతం ఈ ఇంటినీ అమ్మేశారు.

ముడుపుల మత్తులో : ఇలాంటి వ్యవహారాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది, అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వచ్చింది బ్యాంకు ప్రతినిధులా కాదా? పత్రాలు నిజమైనవా కాదా? లెటర్‌ హెడ్‌లు, స్టాంపుల్లో ఏమైనా తేడాలున్నాయా? అని కనీస పరిశీలన చేయడం లేదు. కమీషన్లు తీసుకుని కళ్లు మూసుకుని కథ నడిపిస్తున్నారు. తాడేపల్లిగూడెం, ఏలూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఇలాంటి వ్యవహారాలు దాదాపు 10 జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత బ్యాంకులు, సంస్థల ప్రతినిధులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పరిశీలించగా ఈ అక్రమాలు బయటపడ్డాయి.

అప్రమత్తం చేశాం : కొన్ని ప్రాంతాల్లో నకిలీ పత్రాలు సృష్టించి తనఖా ఉపసంహరణ చేస్తున్న విషయం వాస్తవమే. దీనిపై అన్ని కార్యాలయాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశాం’ అని ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల రిజిస్ట్రార్లు కె.శ్రీనివాసరావు, ఎల్‌.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

గుంటూరు డీసీసీ బ్యాంకులో అక్రమాలు - నకిలీ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతల రుణాలు - Big Scam In Guntur GDCC Bank

ఖాతాదారురాలి సొమ్ము కొట్టేసిన పోస్ట్​మాస్టర్ ​- బాధితురాలి ఆవేదన - Postmaster Fraud in Satya Sai Dist

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.