ETV Bharat / state

ముందుగానే నైరుతి రుతుపవనాలు - నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు - rains in andhra pradesh - RAINS IN ANDHRA PRADESH

Rains in Andhra Pradesh: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 19లోపు దక్షిణ అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ద్రోణి ‌ప్రభావంతో నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాల ప్రభావంతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది.

rains in andhra pradesh
Rains in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2024, 8:09 AM IST

Updated : May 14, 2024, 9:05 AM IST

Rains in Andhra Pradesh: ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 19వ తేదీకల్లా దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు: దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశా తెలిపింది.

అదే విధంగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, సత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, నంద్యాల తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది. అదే విధంగా సోమవారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

అత్యంత వేడి సంవత్సరంగా 2024 - చరిత్రలోనే టాప్​ 5లో ఒకటి - Weather Report in 2024

Last Updated : May 14, 2024, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.