Manchu mohanbabu Vs Manoj : సీనియర్ నటుడు మోహన్‌బాబు పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడు, హీరో మనోజ్, అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్‌కు కంప్లైంట్ చేశారు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పోలీసులను మోహన్ బాబు కోరారు. అసాంఘిక శక్తులుగా మారిన కొంతమంది నుంచి తనకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు.
30 మంది వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు : 'నేను జల్‌పల్లిలో 10 సంవత్సరాలుగా నివాసముంటున్నాను. 4 నెలల కిందట నా చిన్న కుమారుడు ఇల్లు వదిలి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా నివాసం వద్ద కలవరం సృష్టించాడు. మనోజ్ తన 7 మాసాల బిడ్డను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లో గల నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడ్డారు. వారిద్దరూ( మనోజ్, మౌనికలు) నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రతపై, ఆస్తులు, విలువైన వస్తువుల విషయంలో నేను భయపడుతున్నాను' అని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారి నుంచి నాకు రక్షణ కల్పించండి : 'నాకు హాని కలిగించే ఉద్దేశంతో వారున్నారు(మనోజ్, మౌనిక). నా ఇంటిని(నివాసాన్ని) శాశ్వతంగా ఖాళీ చేయాలని బెదిరించారు. వారు సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వారిద్దరూ పథకం వేశారు. నేను 70 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్‌ని. మనోజ్, మౌనిక, అతడి సహచరులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా నివాసంలో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు నాకు రక్షణ కల్పించండి' అని మోహన్‌బాబు ఫిర్యాదులో కోరారు.
హీరో మంచు మనోజ్ కాలికి గాయం - చికిత్స కోసం బంజారాహిల్స్ హాస్పిటల్‌కు
సినీ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం - రూ. 10 లక్షలు చోరీ