MLC Mohammed Iqbal Join TDP : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నుంచి వలసలు భారీగా పుంజుకున్నాయి. వైసీపీ వీడి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. గ్రామ నాయకులు మొదలుకొని అధికార నేతల వరకు వలసల పర్వం నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలుగుదేశంలో చేరారు. ఇటివలే మహమ్మద్ ఇక్బాల్ అధికార పార్టీకి రాజీనామా చేసినట్లు అందరికి తెలిసిందే. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు మహమ్మద్ ఇక్బాల్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
విశాఖలో వైఎస్సార్సీపీకి భారీ షాక్- టీడీపీ, జనసేనలో చేరికలు - Some YCP Leaders Join TDP
Mohammed Iqbal : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి మహమ్మద్ ఇక్బాల్ హిందూపురం నియోజక వర్గం టికెట్‌ను ఆశించారు. కానీ పార్టీ అధిష్ఠానం కోడురి దీపికకు కేటాయించడంతో ఆయన నిరాశ చెందారు. హిందూపురం అసెంబ్లీ టికెట్ అభ్యర్థిగా తప్పించడమే కాకుండా ఆయనకు ఇతర పదవులు లేవీ కేటాయించలేదు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవాళ మహమ్మద్ ఇక్బాల్ వైపీసీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇవాళ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతా: ఆమంచి కృష్ణమోహన్ - Amanchi Krishna Mohan Congress
మహ్మద్ ఇక్బాల్ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబు నాయుడుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతుండడం గమనార్హం.
NTR District : అధికార పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో మున్సిపాలిటీ పరిధిలోని 3 డివిజన్‌కు చెందిన వైసీపీ నాయకులు పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. వీరందరికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు పార్టీ కండవా పార్టీ సాదరంగా ఆహ్వానించారు. అందరు పార్టీ విజయం కోసం కృషి చేయలని శ్రేణులకు సూచించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇప్పటికే పలు వార్డులకు చెందిన వైసీపీ నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరగా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, వైసీపీ సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు 29, 35 వార్డుల కార్పొరేటర్లు ఉరికిటి నారాయణరావు, భాస్కర్‌రావు పలువురు వార్డు స్థాయి నేతలు టీడీపీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో సీతంరాజు సుధాకర్, ఇతర నేతలకు చంద్రబాబు నాయుడు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.