ETV Bharat / state

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం వినలేదు: కోదండరామ్‌ - MLC Kodandaram on medigadda

MLC Kodandaram on Medigadda : మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వద్దన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం వినలేదని ఎమ్మెల్సీ కోదండరాం పేర్కొన్నారు. ఇంజినీర్ల సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ ఒక విధంగా, నిర్మాణం మరోలా చేయడంతోనే కుంగిందని కోదండరాం తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

MLC Kodandaram on kaleshwaram1
MLC Kodandaram on Medigaddaa (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 3:39 PM IST

Updated : Jun 26, 2024, 4:48 PM IST

MLC Kodandaram on kaleshwaram : మేడగడ్డ డిజైన్ ఒకటైతే, నిర్మాణాన్ని మరో రకంగా చేయడంతోనే బ్యారేజీ కుంగిపోయిందని ఎమ్మెల్సీ కోదండరామ్‌ తెలిపారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించడం సరికాదని ఇంజినీర్లు పేర్కొన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్ట్​ నిర్మాణానికి పూనుకుందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైనింగ్​కు ముందు తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీ ఆర్.అంబేడ్కర్ సుజల స్రవంతి పేరుతో, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు.

గత ప్రభుత్వ తొందరపాటు వల్ల ట్రాన్స్​కో, జెన్​కోకు రూ.81 వేల కోట్ల అప్పు : కోదండరాం - Telangana electricity purchases

మేడిగడ్డ నిర్మాణంపై ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని కాగ్ కూడా చెప్పిందని కోదండరాం తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ మెటీరియల్ సక్రమంగా లేదని, నిర్వహణ కూడా సరిగ్గా లేదని డ్యాం సేఫ్టీ అధికారులు తమ నివేదికలో చెప్పారని ఆయన పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి కాలువల ద్వారా నీటిని తెచ్చుకోగలిగితే, గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత దక్కుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు.

తుమ్మిడిహెట్టిని పరిశీలించాలని ప్రభుత్వం, కమిషన్​ను కోరామని కోదండరాం తెలిపారు. ఇంజినీర్ల సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై కమిషన్ వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరిందని కోదండరాం తెలిపారు. కమిషన్ వేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు.

ప్రజల సొమ్మును బాధ్యతగా ఖర్చు చేయాలని ఆయన తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిటీని రద్దు చేయించి, వాస్తవాలు బయటకు రాకుండా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని, పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఅర్ ఉద్యమకారులపైన ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరాల్సిందిపోయి, తనపైన ఉన్న కేసులు ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యం అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు కోదండరామ్ పేర్కొన్నారు. బొగ్గు గనులను వేలం వేయడమంటే ప్రైవేటీకరణకు దారి తీస్తుందని ఆయన తెలిపారు, బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

"బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంజినీర్ల సూచనలను బేఖాతరు చేసి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించింది. ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని కాగ్ సైతం స్పష్టం చేసింది. ఇందులో అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి". - కోదండరామ్, ఎమ్మెల్సీ

ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవనాన్ని వీలైనంత త్వరగా నిర్మించాలి : ప్రొఫెసర్ కోదండరాం - Prof Kodandaram On Osmania Hospital

బీజేపీలో సీఎం రేవంత్​ చేరతారనే బీఆర్ఎస్ వ్యాఖ్యలు హాస్యాస్పదం : ప్రొఫెసర్ కోదండరాం - Prof Kodandaram Fires On BRS

Last Updated : Jun 26, 2024, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.