MLC Kavitha on Caste Census Resolution Bill : అసెంబ్లీలో కేవలం కులగణన తీర్మానం పెట్టి తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రభుత్వం అసెంబ్లీ ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై ఆమె నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు బీసీల కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోపల 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని, తద్వారా 29 వేల మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని కాంగ్రెస్ నమ్మబలికిందని కవిత వివరించారు. ఎన్నికల తరువాత కంటి తుడుపు చర్యలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాలను పక్కకు పెట్టారని విమర్శించారు.
దేశానికి ఆదర్శంగా ఉండేలా కులగణన - అందరి సలహాలు, సూచనలతో ముందుకెళ్తాం : మంత్రి పొన్నం
Telangana Government Passed Caste Census Resolution Bill : బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు రెండు అసెంబ్లీ సమావేశాలు అయినా ఇప్పటి వరకు బీసీ సబ్ ప్లాన్‌కు అతీగతీ లేదని విమర్శించారు. ఎప్పుడు కులగణన మొదలుపెడతారు, ఏ సంస్థ ద్వారా చేస్తారని ప్రశ్నించారు. కులగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారని నిలదీశారు. దీని లక్ష్యం ఏంటని చెప్పకుండా మభ్యపెట్టే విధంగా తీర్మానం చేశారని మండిపడ్డారు. కులగణనకు సంబందించి చట్టం ప్రవేశ పెట్టి చట్ట బద్ధత కల్పించాలన్న కవిత, బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించి రూ.20 వేల కోట్ల నిధులతో పాటు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు.
'పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే మా ఉద్దేశ్యం' - అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం
"2011లో మర్చిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. మాలాంటి వారు ప్రశ్నిస్తే, మీరు పెట్టిన మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదు, ఇప్పుడే మీకు బీసీలు గుర్తుకు వచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీని మేము అడుగుతున్నాం బీసీలు మీకు ఇప్పుడు గుర్తుకు వచ్చారా." - కవిత ఎమ్మెల్సీ
'మేం అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన- రిజర్వేషన్లపై 50% లిమిట్ తీసేస్తాం'
ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలకు ప్రధాన ప్రతిపక్షంగా అడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు చేసిన యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, రైతుల గురించి ఇలా వారు చేసిన ప్రతిదానికి ప్రతిపక్ష నాయకులుగా ప్రశ్నిస్తామని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షం నుంచి అడగగానే అధికారంలోకి వచ్చి కొన్ని రోజులే అయ్యింది అంటున్నారని, వారు చెప్పినట్టే 100 రోజులు పూర్తి కాగానే తాము గట్టిగానే ప్రశ్నిస్తామని కవిత తెలిపారు. బీసీ కులగణన అనేది సమయాన్ని తీసుకుంటుంది, అందువల్లే అధికారంలో ఉన్నవారిపై ఒత్తిడి తీసుకువస్తున్నాం. చట్టబద్ధత కల్పిస్తే తప్ప కులగణన పూర్తి కాదన్నారు. చట్టబద్ధత కల్పించాలని అడిగితే, తిరిగి ప్రతిపక్షంపై మాటలు అనడం సరికాదని హితవు పలికారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బీసీ సంక్షేమ శాఖ కేంద్రంలో ఉండాలని వారికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
బీసీలందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే కులగణన : మంత్రి పొన్నం ప్రభాకర్