ETV Bharat / state

షాద్​నగర్​ ఘటనాస్థలికి ఎమ్మెల్యే - మృతుల కుటుంబాలకు యాజమాన్యం రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ - shandnagar mla visit incident place - SHANDNAGAR MLA VISIT INCIDENT PLACE

shadnagar MLA visited South Glass Factory : షాద్​నగర్ గ్లాస్ ఫ్యాక్టరీ సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ఫ్యాకరీలో కార్మికుల సేఫ్టీకి సంబంధించి ఎలాంటి పరికరాలు లేవని అందుకే ప్రమాదం జరిగిందన్నారు. యాజమాన్యంపై హత్యా నేరం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

Shadnagar MLA Visited South Glass Factory Incident Place
Shadnagar MLA Visited South Glass Factory Incident Place (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 3:48 PM IST

Shadnagar MLA Visited South Glass Factory Incident Place : రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గం ఫరూక్​నగర్ మండలం బూర్గుల సమీపంలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం భారీ పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటనా స్థలాన్ని షాద్​నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉదయం 10గంటల సమయంలో పరిశీలించి, కార్మికులతో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. సంఘటనలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారంతో పాటు మృతి చెందిన ఐదు కుటుంబాలకు ఒక ఉద్యోగం చొప్పున అవకాశం కల్పించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అలాగే చికిత్స పొందుతున్న వారందరికీ పరిశ్రమ యాజమాన్యం పూర్తిస్థాయిలో మెరుగైన చికిత్స చేయించాలని ఆదేశించారు.

గ్లాస్​ పరిశ్రమలో గ్యాస్​ కంప్రెషర్​ పేలుడు - అయిదుగురు దుర్మరణం - blast in south glass factory

అందుకే ప్రమాదం జరిగింది : ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని చెప్పారు. మృతదేహాలను పరిశ్రమ యాజమాన్యమే వారివారి స్వగ్రామాలకు పంపించాలని తెలిపారు. పరిశ్రమలో సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనల ప్రకారం పరిశ్రమలో వసతులు ఉండేలా చూడాలని, కార్మికులకు సేఫ్టీ పరికరాలు ఇచ్చేలా చేయాలని చెప్పారు. సౌత్ ​గ్లాస్ పరిశ్రమలో యాజమాన్యం తగిన సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నారు. యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. పరిశ్రమ యాజమాన్యంపై హత్యా నేరం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఘటనతో నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ పరికరాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేపడతామని తెలిపారు.

MLA Teenmaar Mallanna Visits Shadnagar Glass Factory : నిబంధనలు పాటించని సౌత్ గ్లాస్ పరిశ్రమ యాజమాన్యంపై హత్యా నేరం కేసు పెట్టాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పరిశ్రమను 11.30 ప్రాంతంలో పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం, ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన చికిత్స అందించి వారు త్వరగా కోలుకునే విధంగా చూడాలని అన్నారు.

షాద్​నగర్​ ఘటనాస్థలికి ఎమ్మెల్యే మృతుల కుటుంబాలకు యాజమాన్యం రూ25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ (ETV Bharat)

ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు, ముగ్గురికి తీవ్రగాయాలు - Blast In Fireworks Center

పరిశ్రమలో బాంబ్​ బ్లాస్టింగ్ -​ బిహార్​ యువకుడు సజీవ దహనం - Man Burnt Alive in medchal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.