ETV Bharat / state

కాంగ్రెస్​లో చేరిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి : కేటీఆర్ - MLA KTR Tweet - MLA KTR TWEET

MLA KTR Tweet On Jumping Leaders : ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం లేదా స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించి అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్‌ నిరూపించుకోవాలని తెలిపారు.

KTR Fires On Congress
MLA KTR Tweet On Jumping Leaders
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 11:28 AM IST

MLA KTR Tweet On Jumping Leaders : భారతదేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాను ప్రారంభించిన ఆయా రాం - గయా రాం సంస్కృతిపైన ఇప్పటికైనా విధానం మార్చుకోవడం మంచిదే అని ఎక్స్​లో కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే సాధారణంగా సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగినదన్నారు.

దానం విషయంలో ఆదివారంలోగా నిర్ణయం తీసుకోవాలి - లేదంటే హైకోర్టుకే : కేటీఆర్ - KTR ON DANAM

KTR Fires On Congress : కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందని, హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటున్నాయన్నారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. మరొక బీఆర్​ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందన్నారు.

రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశం పైన మాట్లాడాలన్నారు. లేకుంటే ఆయన ఒక హిపోక్రట్​గా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం లేదా స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించాలని తెలిపారు. తాము చెప్పిందే చేస్తాము అబద్ధాలు చెప్పమనే విషయాన్ని దేశానికి నిరూపించుకోవాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు.

Etela Rajender Comments on Congress : కాంగ్రెస్ మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇటీవల​ విమర్శించారు. ఒక పార్టీలో గెలిచి, ఇతర పార్టీల్లో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్​ రెడ్డి, దానం నాగేందర్​ను ఎలా పార్టీలోకి చేర్చుకున్నారని ప్రశ్నించారు. కడియం శ్రీహరి దళితుడే కాదని సీఎం రేవంత్ (CM Revanth reddy)​ అన్నారని, అలాంటప్పుడు ఆయన కుమార్తెకు ఎంపీ టికెట్​ ఎలా ఇచ్చారని నిలదీశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అధికారంలో లేనప్పుడు ఒక విధంగా, వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్‌ రెడ్డి - ఇప్పుడెలా చేర్చుకుంటున్నారు : ఈటల - Lok Sabha Elections 2024

హీరోయిన్లను బెదిరించాల్సిన ఖర్మ నాకు పట్టలేదు: కేటీఆర్‌ - Phone Tapping issue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.