ETV Bharat / state

కాకినాడను గంజాయి రహితంగా మార్చుతాం - డంపింగ్‌యార్డు రోడ్డుని తెరిపించిన ఎమ్మెల్యే కొండబాబు - opened Kakinada dumping yard route - OPENED KAKINADA DUMPING YARD ROUTE

MLA Kondababu Opened Kakinada Dumping Yard Route : కాకినాడను గంజాయి రహిత నగరంగా మార్చాలని అధికారులకు, పోలీసులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సూచించారు. ఐదేళ్లుగా డంపింగ్‌ యార్డు నుంచి పోర్టుకు వెళ్లే మార్గాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ గంజాయి ముఠాకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. ఇంతకాలం మూసేసిన రహదారిని ఎమ్మెల్యే కొండబాబు అధికారులతో కలిసి తిరిగి తెరిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తామన్నారు.

MLA Kondababu Opened Kakinada Dumping Yard Route
MLA Kondababu Opened Kakinada Dumping Yard Route (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 7:25 PM IST

కాకినాడను గంజాయి రహితంగా మార్చుతాం - డంపింగ్‌యార్డు రోడ్డుని తెరిపించిన ఎమ్మెల్యే కొండబాబు (ETV Bharat)

MLA Kondababu Opened Kakinada Dumping Yard Route : కాకినాడను గంజాయి రహిత నగరంగా మార్చాలని అధికారులకు, పోలీసులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సూచించారు. ఐదేళ్లుగా డంపింగ్‌ యార్డు నుంచి పోర్టుకు వెళ్లే మార్గాన్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ గంజాయి ముఠాకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. ఇంతకాలం మూసేసిన రహదారిని ఎమ్మెల్యే కొండబాబు అధికారులతో కలిసి తిరిగి తెరిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తామన్నారు.

దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారు - పది రోజుల్లో న్యాయం చేయాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ - JC Prabhakar fire on YCP leaders

ఐదేళ్లుగా డంపింగ్‌ యార్డు మార్గాన్ని ద్వారంపూడి మూసేశారు : ఎమ్మెల్యే కొండబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ గత ఐదేళ్లుగా కాకినాడలోని డంపింగ్ యార్డ్ దారిని మూసివేయించారని మండిపడ్డారు. గతంలో డంపింగ్ యార్డ్ నుంచి పోర్ట్​కు వందల సంఖ్యలో వాహనాలు వెళ్లేవని గుర్తుచేశారు. అలాంటి ప్రధాన రహదారిని ద్వారంపుడి మూయించడం వల్ల ఐదేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అటువైపు వాహనాలు వెళ్లక పోవడంతో డంపింగ్ యార్డ్ మెుత్తం అసాంఘిక కార్యకలాపాలాలకు నిలయంగా మారిందని విమర్శించారు. దీనిపై అప్పట్లో అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దీని కారణంగా ఈ ప్రాంతాం గంజాయి ముఠాలకు కేంద్రంగా మారిందని విమర్శించారు. ఆ ప్రాంతంపై తాను గతంలో చేసిన ఆరోపణలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నానని కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు.

మూసేసిన డంపింగ్‌యార్డు రోడ్డుని తిరిగి తెరిపించిన ఎమ్మెల్యే : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ నగరపాలక కమిషనర్, పోర్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్థానిక ప్రజలతో కలిసి ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే వనమాడి పరిశీలించారు. ఇంతకాలం మూసివేసిన రహదారిని తిరిగితెరిపించి వాహనాల రాకపోకలకు వీలుగా చెత్తను జేసీబీలతో తొలగించారు. ఐదేళ్లుగా ఉన్న సమస్య తొలగిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే పక్కనే లారీల యార్డ్ ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలు నిలుపుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రాంతంలో ఇకపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్టు వేస్తానని ఎమ్మెల్యే మనమాడి కొండబాబు తెలిపారు.

ఏపీ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - AP New AG Dammalapati Srinivas

మద్యం మత్తులో కుక్క పిల్లను తెచ్చి పిల్లికి వైద్యం చేయాలంటూ హల్ చల్ - man behaves influence of alcohol

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.