MLA Komatireddy Rajagopal Reddy About Telangana Loksabha Election : వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీసీలను గెలిపించుకునేందుకు తాము ఉన్నామని, కాంగ్రెస్ పార్టీకి పది లోక్‌సభ(TS Loksabha) సీట్లు రావడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీలకు రెండు స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పది సంవత్సరాలు నల్గొండ జిల్లాకు అన్యాయమే జరిగిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే రూ.570 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో(Munugodu Byelection) రూ.600 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. దేశంలోనే మునుగోడు ఉప ఎన్నిక ఖరీదైందిగా మిగిలిపోయిందని తెలిపారు.
ఎన్ని సంవత్సరాలు కష్టపడినా నిన్ను సీఎంని చేయరు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
MLA Komatireddy Fires on Chalamala Krishna Reddy : తనకు తెలియకుండానే చలమల కృష్ణారెడ్డి పార్టీలో చేరారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తనపై ఇష్టమొచ్చినట్లు ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు. తన వల్ల పార్టీకి లాభం అవుతుందనే కదా నన్ను పిలిచారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీలోకి ఆహ్వానిస్తేనే కదా వచ్చానని మీడియాతో తెలిపారు. డబ్బులతో చలమల రాజకీయం చేద్దామని అనుకున్నారని దుయ్యబట్టారు. చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక చెల్లదని విమర్శించారు. చలమల కృష్ణారెడ్డి వ్యక్తిత్వం లేని మనిషి అని, ఆయన రాజకీయాలకు పనికి రాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్‌రావు అధ్యక్షుడు కావాలి : ఫిబ్రవరి 15న నిర్వహించిన ఇష్టాగోష్ఠి(Chitchat)లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ బతకాలంటే హరీశ్‌రావును పార్టీ అధ్యక్షుడు చేయాలని సూచించారు. అదే కేటీఆర్ పార్టీ అధ్యక్షుడు అయితే పార్టీలో ఒక్కడు కూడా ఉండడని తెలిపారు. కేసీఆర్ వారసుడు హరీశ్‌రావు మాత్రమేనని, ఆయనే అధ్యక్షుడు అయితే పార్టీ బతుకుతుందని చెప్పారు. అలాగే కేటీఆర్‌పై విమర్శలు చేశారు. ఆయన పొలిటీషియన్ కాదని, హైటెక్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు.
భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని మునుగోడు ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతున్నారు. పేరు కోసం, డబ్బు కోసం మాత్రమే కేసీఆర్(KCR) నిర్మాణాలు చేశారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇలా బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లోకి చేరి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి బీఆర్ఎస్ విధానాలపై ధ్వజమెత్తుతూ వస్తున్నారు.
గత ప్రభుత్వం దోపిడీ, కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం : రాజగోపాల్ రెడ్డి
బీఆర్ఎస్ బతకాలంటే హరీష్ రావు పార్టీ అధ్యక్షుడు కావాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి