MLA JC Ashmit Reddy Complaint to SP Jagadish on CI: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసినా రూరల్ సీఐ లక్ష్మీకాంతరెడ్డి పట్టించుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అనంతపురం ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జిల్లా ఎస్పీ జగదీశ్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని ఎస్పీని కోరారు. పోలీసులు చేయాల్సిన పని తాను చేసి, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలను పట్టుకొని అప్పగించినా సీఐ లక్ష్మీకాంతరెడ్డి కేసులు పెట్టడం లేదని అన్నారు. తాము ఇసుక లారీలు పట్టిస్తే వారిని రాజీ చేసుకోడానికి పోలీస్ స్టేషన్‌కు పిలుస్తున్నారని అన్నారు. ఐదేళ్ల పాటు అక్రమ ఇసుక తవ్వకాలపై మీద పోరాటం చేశామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ దందా కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు.
జగన్ హయాంలో ఇసుక దందా మీద పోరాటం చేసిన తామే అధికారంలోకి వచ్చాక చూస్తూ ఊరుకుంటే ఎలాగంటూ ఎమ్మెల్యే అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఇసుక అక్రమ తవ్వకాలపై గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసు వేశామని కోర్టు ఆదేశాలతో అప్పట్లో నిలిపివేయించామని అన్నారు. ఇసుక అక్రమాలపై తమ ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, విచారణ అధికారులు తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తూ విచారణ చేస్తున్నారని అస్మిత్ రెడ్డి చెప్పారు. తాడిపత్రిలో ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఈ అక్రమాలను ఆపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చెప్పారు.
నెలరోజులుగా సీఐకి ఫిర్యాదు చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. తాము ఇసుక లారీలు పట్టుకొని అప్పగిస్తే కేసులు నమోదు చేయకుండా వారిని రాజీ కోసం స్టేషన్‌కు రావాలని పిలుస్తున్నారు. పట్టిచ్చిన లారీలపై కేసు పెట్టకపోవడం వల్ల నేను స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇకపై తాడిపత్రిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక దందాను కొనసాగనివ్వను. గత ప్రభుత్వలో అక్రమ తవ్వకాలపై విచారణ ప్రారంభమైంది. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరడం జరిగింది.- జేసీ అస్మిత్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే
ఊరు దాటాలంటే వాగు ఈదాల్సిందే- 'ఇకనైనా రహదారి నిర్మించరూ' - no Road Facility In Alluri district