Mistakes in Andhra Pradesh Voter list 2024 : ఓటర్ల తుది జాబితా తప్పుల తడకగా విడుదలైంది. ఫిర్యాదులపై ఓటర్ల జాబితాలో మార్పులు చేసి, తప్పులు సరిదిద్దామని ఎన్నికల అధికారులు చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. గ్రామానికి సంబంధంలేని వ్యక్తుల పేర్లు సైతం తుది జాబితాలో కనిపిస్తుంటే స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అనంతపురం జిల్లా పాత చెదళ్ల గ్రామంలో స్థానికేతరుల ఓట్లు కొనసాగుతుండటంపై గ్రామస్తులు నివ్వెరపోతున్నారు.
తుది జాబితాలోనూ వైఎస్సార్సీపీ దొంగ ఓట్ల దందా
Doble Votes Problems In Anantapur District : అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల సంఘం వేటు వేస్తున్నప్పటికీ ఓటర్ల జాబితా పర్యవేక్షిస్తున్న అధికారుల్లో మార్పు రావటం లేదు. ఈనెల 22న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా అంతా స్వచ్ఛంగా ఉందని, తప్పులు సరిచేశామని కలెక్టర్ గౌతమి తెలిపారు. అయితే ఈ జాబితా కూడా తప్పుల తడకగా ఉందని, అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉందని స్పష్టమవుతోంది. బుక్కరాయసముద్రం మండలం పాతచెదళ్ల గ్రామంలో 1359 ఓటర్లు ఉండగా వాటిలో వందకు పైగా బోగస్ ఓట్లు గానూ, మరి కొన్ని స్థానికేతరులవిగా ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల పేర్లును అక్రమంగా ఓటర్ల జాబితాలో చేర్చారంటూ గ్రామస్తులు.
ఓట్ల అక్రమాలపై కొరడా ఝుళిపిస్తున్నా మారని అధికారుల తీరు - టీడీపీ నేతల మండిపాటు
Mistakes In Anantapur Voter List : గ్రామంలోని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన 27 మంది మహిళల పేర్లు తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేయగా అందులో ఒక్క మహిళను మాత్రమే తొలగించి మిగిలి వారందరిని యథావిధిగా కొనసాగిస్తున్నారు. పుట్టిన ఊరిలో తొలగించిన ఓట్లు మెట్టింటి వారి ఊర్లో నమోదు చేసుకోక పోవడంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పుట్టిన ఊరికి వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. మరోవైపు చెదళ్ల ఓటర్ల జాబితాలో ఉన్న వంద మంది వరకు ఓటర్లు అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లోని ఓటర్లుగా ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
కొత్త ఓటరు జాబితాలోనూ అదే నిర్లక్ష్యం - అవే పాత తప్పులు!
Final Voter List : పోలింగ్ రోజున వేలుకు కొబ్బెరి నూనె పూసుకొని వెళితే, వేలికి వేసే ఇంకు మార్కును వెంటనే తుడిచేసి, మరో ఊర్లో ఓటు వేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఈ డబుల్ ఓటర్లంతా ఈ విధంగానే చేశారని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ జోక్యం చేసుకొని వెంటనే బోగస్, డబుల్ ఓట్లను తొలగించాలని గ్రామస్తులు డిమాండ చేస్తున్నారు.
దొంగ ఓట్లతో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోంది: భానుప్రకాశ్‌రెడ్డి