Farooq Shibli reaction to YSRCP defeat: ముస్లిం సమాజం ఏకమై జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపిందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మైనార్టీల హక్కులను హరిస్తామని వైఎస్సార్సీపీ చేసిన ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ముస్లింలు, దలితులపైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత జగన్ అహంకారానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని ఫరూక్ షిబ్లీ పేర్కొన్నారు. వైఎస్ జగన్ కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలను సైతం టీడీపీ కూటమి కైవసం చేసుకుందన్నారు. ముస్లింలకు ఏడు సీట్లు కేటాయించామని గొప్పలు చెప్పకున్న వైఎస్సార్సీపీ వారిని గెలుపించుకోవడంలో విఫలమయ్యిందన్నారు. టీడీపీ ముస్లింలకు కేటాయించిన మూడు స్థానాల్లోనూ వారిని గెలిపించుకుందన్నారు. ముస్లింలందరూ కాబోయే ముఖ్యమంత్రి చంద్రాబాబుని నమ్మి ఏకపక్షంగా ఓట్లు వేశారన్నారు. విజయవాడలోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన షిబ్లీ కాబోయే టీడీపీ అధినేత చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు.
సెలవుపై జవహర్‌రెడ్డి- సాయంత్రం కొత్త సీఎస్‌ను నియమించే అవకాశం! - CS Jawahar Reddy
మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ముస్లిం ప్రజలను నిలువునా మోసం చేశారని కాంగ్రెస్ నేత అఫ్జల్ ఖాన్ ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికల్లో ముస్లింలు తమ ఓటుతో ఆంజాద్ భాషకు బుద్దిచెప్పారని తెలిపారు. తనను రాజకీయంగా ఎదగకుండా అడ్డుకున్నారని అఫ్జల్ ఖాన్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వాలని కోరితే వెయ్యి ఓట్లు కూడా రావని తనను అవహేళన చేశాడని అఫ్జల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారణంతోనే తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి 24 వేల ఓట్లు సాధించానని ఆయన చెప్పారు. కడపలో అంజాద్ భాష అతని సోదరుడు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మసీదు స్థలాలను సైతం కబ్జా చేశారని విమర్శించారు. తనకు వెయ్యి ఓట్లు కూడా రావని అవహేళన చేసిన వ్యక్తి నేడు ఓటమిపాలు అయ్యాడని దుయ్యబట్టారు. ప్రజలు తనకు 24 వేల ఓట్లకు పైగా వేశారని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల్లో గెలవక పోయినప్పటికీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని తెలిపారు.