Minister Thummala On paddy procurement : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ వేయి పాళ్లు నయమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం అని తెలిపారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఐకేపీ సెంటర్ల పెంపు ద్వారా గత ఏడాదితో పోలిస్తే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామని వివరించారు.
జిల్లాకొక అధికారిని నియమించాం : ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ కోసం జిల్లాకొక ఐఏఎస్ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నామని మంత్రి తెలిపారు. తరుగు, తాలు పేరిట కోతలు లేవన్న మంత్రి గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ ఉండేదని గుర్తు చేశారు. ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్ల స్వస్తి చెప్పడం వల్ల ప్రతి కింటాపై రైతుకు రూ.150 నుంచి 200ల వరకు అదనపు లబ్ధి చేకూర్చామని స్పష్టం చేశారు.
పంట అమ్మిన ఐదురోజుల్లోనే ఖాతాల్లో నగదు జమ : రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని, గతంలో 45 రోజులు పట్టేదని తుమ్మల ఆక్షేపించారు. గతంలో రైతు ఎంతో వడ్డీ నష్టపోయేవాడు కానీ, ప్రస్తుతం కేవలం 5 రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమవుతుండటం వల్ల రైతుకు వడ్డీ వ్యాపారుల వేధింపులు లేవని చెప్పారు. వడ్డీ వ్యాపారులకు అధిక వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా ఆత్మగౌరవంతో ఇప్పుడు రైతు బతుకుతున్నాడని తెలిపారు.
Minister Tummala Fires On KCR: కేసీఆర్ ప్రభుత్వంలో ఫసల్ బీమా యోజన లేదని, ఉంటే కనీసం పంట పరిహారం వచ్చేదని మంత్రి తెలిపారు. అయినప్పటికీ కాంగ్రెస్ రైతు ప్రభుత్వమైనందువల్ల పంట నష్టపోయినా రైతులకు పరిహారం అందిస్తోందని వివరించారు. ఇక ముందు ఏ ఒక్క రైతు కూడా ఇలా నష్టపోకుండా ప్రభుత్వమే రైతుల ప్రీమియం చెల్లించి పంటల బీమా పథకాన్ని రూ.3 వేల కోట్ల రూపాయలు వెచ్చించి వానా కాలం నుంచి అమలు చేస్తున్నామని వెల్లడించారు.
Minister Thummala On Farmers : తడిచిన ధాన్యం సైతం తమ ప్రభుత్వం సేకరిస్తుందని, గతంలో కల్లాల్లో వరి కుప్పల మీద రైతులు గుండె పగిలి చనిపోయారు కానీ, మాది రైతు ప్రభుత్వం అని తెలిసి రైతులు గుండె ధైర్యంతో బతుకుతున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు రూ.500 బోనస్ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి సన్న బియ్యం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నందున మనం దొడ్డు వడ్లు అమ్ముకొనుడేంది, సన్న వడ్లు కొనుక్కునుడేంది? మనమే మనకు అవసరమైనంత సన్నవడ్లు ఉత్పత్తి చేసుకునేందుకు ఈ బోనస్ పథకం ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.
దొడ్డువడ్లకు రూ.500 ఇప్పుడు ఇవ్వలేకపోయినా మూడు నుంచి ఐదు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తూ మిల్లర్ల ధాన్యం కోతను అరికడుతూ ప్రత్యక్షంగా ఆ మేర రైతుకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందన్నారు. రైతులను కాల్చుకుతిన్న బీఆర్ఎస్ అగ్రనాయకులు ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
పంట నష్టంపై వ్యవసాయ శాఖ ఫోకస్ - నిధుల విడుదలకు సిద్ధమన్న మంత్రి తుమ్మల - crop damage in telangana
"సన్నవడ్లకు బోనస్ ఇస్తామని 2020లో కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్నా నయా పైసా బోనస్ ఇయ్యలేదు. అందుకే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అన్నదాతలారా ఆలోచించండి ఇది ప్రజాప్రభుత్వం ఎక్కడా దుబార చేయకుండా కేసీఆర్ అస్తవ్యస్థం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలు పూర్తి చేసి తీరుతామని లేకుంటే ఓట్లే అడగం, ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రకటనలు మానుకోవాలి"- తుమ్మల నాగేశ్వర రావు, మంత్రి
విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు : మంత్రి తుమ్మల - Minister Tummala On Seed Supply