ETV Bharat / state

రైతుల సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ విఫలం : శ్రీధర్‌బాబు - minister sridhar babu fires on bjp - MINISTER SRIDHAR BABU FIRES ON BJP

Minister Sridhar Babu fires on BJP : గత పదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం రైతు సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని, మంత్రి శ్రీధర్‌బాబు దుయ్యబట్టారు. రైతుల పంటలకు మద్ధతు ధరలను ప్రకటించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని, పెట్రోల్ డీజిల్‌ యూరియా ధరలు విపరీతంగా పెంచినట్లు మండిపడ్డారు.

Lok Sabha Elections 2024
Minister Sridhar Babu fires on BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 9:47 PM IST

Minister Sridhar Babu fires on BJP : పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే గడ్డం వంశీకృష్ణను ప్రజలు గెలిపించాలని, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో పెద్దపల్లి నుంచి గెలిచిన ఎంపీలు ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

రైతుల పేరిట బీఆర్ఎస్ దొంగ దీక్షలకు దిగింది : మంత్రి శ్రీధర్​ బాబు - Minister Sridhar babu on BRS Party

Lok Sabha Elections 2024 : ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎక్కువ శాతం ఉన్న రైతుల సమస్యలను, అటు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం, రైతులు పండించిన పంటలకు మద్ధతు ధరను ప్రకటించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను అధికంగా పెంచారన్నారు.

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తమ తమ ప్రాంతాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణకు రాజకీయం అవగాహన ఉందని, గతంలో గతంలో తన తాత గడ్డం వెంకటస్వామి, తరువాత తన తండ్రి గడ్డం వివేక్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడం వల్ల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరిలో పెద్దపల్లి జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ నరసింహారెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌లోకి చేరారు.

"బీజేపీ ప్రభుత్వం రైతులను ఏనాడు పట్టించుకోలేదు. అలాగే రాష్ట్రంలోని గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం రైతులపై శ్రద్ధ చూపించలేదు. రైతుల పంటలకు మద్ధతు ధరలను ప్రకటించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైంది. పెట్రోల్ డీజిల్‌ యూరియా ధరలు విపరీతంగా పెంచి సాగుభారాన్ని మరింతగా పెంచుతోంది. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. పెద్దపల్లి అభ్యర్థిగా వంశీకృష్ణను గెలిపించాలి". - శ్రీధర్‌బాబు, మంత్రి

రైతుల సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ విఫలం : శ్రీధర్‌బాబు

గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం : శ్రీధర్‌ బాబు - Lok Sabha Election 2024

అందరి ఫోన్లు ట్యాప్ చేశారు - నిందితులందరూ బయటకు వస్తారు : శ్రీధర్ బాబు - lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.