Minister Sridhar Babu Inaugurates Social Startup Impulse 2024 : మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దయార గ్రామంలో బాల వికాస - తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోషల్ స్టార్టప్ ఇంపల్స్ - 2024 సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. బాల వికాస ఫౌండర్ బాల తెరెసా జింగ్రాస్‌తో కలిసి ఎక్స్‌పోను ప్రారంభించారు. రాష్ట్రంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని, స్టార్టప్‌ల ప్రోత్సాహానికి బాల వికాస చేపడుతున్న ఈ ఎక్స్‌పో ఎంతో మేలు చేస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar babu) పేర్కొన్నారు.
జిల్లాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు రావట్లేదో అధ్యయనం చేస్తాం : శ్రీధర్‌బాబు
TSIC- CSRB Social Entrepreneurship 2024 : ఇంపల్స్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన ప్రయోగాలను పరిశీలించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. వీటిని ప్రోత్సహించడానికి టీ-హబ్, వీ-హబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పది మందికి ఉపయోగపడే వినూత్న ఆలోచనతో వస్తే రాష్ట్రప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (CSRB) ప్రాంగణంలో దేశ వ్యాప్తంగా సుమారు 700 మంది సామాజిక వ్యాపార వేత్తలు, ఇంపాక్ట్ ఇన్వెస్టర్లు, పలు వ్యాపారరంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 70కి పైగా సామాజిక వ్యవస్థాపకులు తమ సామాజిక వ్యాపార ఉత్పత్తులను సోషల్ స్టార్టప్ ఎక్స్ పోలో ఆవిష్కరించారు. వాటి ఉపయోగాలను వివరించారు.
సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ ఎకో సిస్టంను బలోపేతం చేయడంతో పాటు భాగస్వాముల మధ్య సమన్వయం ఏర్పాటు చేసే ఉద్దేశంతో సదస్సును ఏర్పాటు చేసిన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్, ముంబై), టీ-హబ్, వీ-హబ్, ఉపాయ సోషల్ వెంచర్స్, ఏజీ హబ్, కాస్పియన్, ఇంపాక్ట్ హబ్, హైదరాబాద్ క్యాండిడెడ్, యాక్షన్ ఫర్ ఇండియాతో పాటు సీబీఐటీ, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లాంటి తదితర సంస్థలు కూడా తమ సహకారం అందిస్తున్నాయి.
"స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ మరింత అభివృద్ధి చెందాలి. వీటిని ప్రోత్సహించడానికి టీ-హబ్, వీ-హబ్‌లను ఏర్పాటు చేశాం. పది మందికి ఉపయోగపడే వినూత్న ఆలోచనతో వస్తే రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా ఉంటుంది. రాష్ట్రంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి". - శ్రీధర్ బాబు, ఐటీ మంత్రి
ఆరు గ్యారంటీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నాం : శ్రీధర్‌బాబు