ETV Bharat / state

పరీక్షల నిర్వహణలో మోదీ ఫెయిల్ - నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి : మంత్రి శ్రీధర్‌బాబు - SRIDHAR BABU ON NEET PAPER LEAK

Minister Sridhar Babu On NEET Paper Leak : నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పరీక్షల నిర్వహణలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. నీట్ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కోరారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 2:25 PM IST

Updated : Jun 20, 2024, 3:01 PM IST

Minister Sridhar Babu
Minister Sridhar Babu (ETV Bharat)

Minister Sridhar Babu On NEET Exam Row : దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చంతా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపైనే. ఇప్పటికే ఈ వ్యవహారంపై పలువురు రాజకీయ నేతలు, నిపుణులు స్పందించారు. తాజాగా ఈ పరీక్షపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. నీట్‌ పరీక్షకు సంబంధించిన అవకతవకలపై కేంద్రం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 63 మందికి ఒకటే ర్యాంక్ వచ్చిందన్న మంత్రి విద్యార్థులకు అన్యాయం జరగకూడదని కాంగ్రెన్‌ ప్రభుత్వం తరఫున డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు.

సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు నీట్ పరీక్షతో పాటు, తెలంగాణ జాబ్ క్యాలెండ్, ఇతర పరీక్షల విషయంపైన మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని మంత్రి ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిమాండ్ చేశారు.

"ఫిబ్రవరి 9 నుంచి నెలరోజుల పాటు కేంద్ర సర్కార్ దరఖాస్తులకు అనుమతించింది. ఆ తర్వాత మరో వారం రోజులు గడువు పొడిగించింది. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని ఘటనలు జరిగాయి. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉంది. కానీ జూన్ 4న రిజల్ట్ ఇవ్వడంతో అనుమానాలు మరింత పెరిగాయి . విద్యార్థులు అనేక సంఘాలు ఆందోళన చేశాయి. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంక్ రావడం మరింత అనుమానానికి తావిచ్చింది. నీట్ అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి." - శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి

పోటీ పరీక్షల నిర్వహణలో ప్రధానంగా వైద్య విద్యలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. గ్రేస్ మార్కులను కలపడంపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పరీక్షళ నిర్వహణలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నీట్‌పై విద్యార్థులకు మళ్లీ నమ్మకం కలిగేలా కేంద్రం ఈ విషయంలో వ్యవహరించాలని సూచించారు.

Sridhar Babu On Singareni Mines : 'గనుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక విషయం చెబుతున్నాను. లాభాల్లో నడుస్తున్న సంస్థ సింగరేణి సంస్థ. కార్మికుల నైపుణ్యంతో ఆ సంస్థ చాలా బలంగా ఉంది. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే చేయాలి. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పునరాలోచన చేయాలి. ఓవైపు సింగరేణిని ప్రైవేటుపరం చేయమంటూనే మరోవైపు ప్రైవేటు వ్యక్తుల చేతికి కట్టబెట్టే పనిలో కేంద్రం ఉంది. అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నాయి.' అని శ్రీధర్ బాబు అన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో సర్కార్ అప్రమత్తంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించిన సహించమని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ఏపీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్న శ్రీధర్ బాబు వారి సంక్షేమం దిశగా తమ పాలన సాగుతుందని పునరుద్ఘాటించారు.

హైకోర్టుల్లో నీట్​ పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే- కౌన్సిలింగ్​ ప్రక్రియ ఆపేది లేదని స్పష్టం - SC On NEET UG 2024

UGC NET పరీక్ష రద్దు- అవకతవకలు జరగడమే కారణం

Last Updated : Jun 20, 2024, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.