Minister Savitha Received Requests from People at NTR Bhavan: ప్రజల సమస్యలు తీర్చేందుకు అమాత్యులందరూ కష్టపడాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలను మంత్రులు తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉండాలన్న సూచనలతో మంత్రులు ఎన్టీఆర్ భవన్‌కు వెళ్తున్నారు. పార్టీ కార్యాలయంలో కూర్చుని వస్తున్న ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన వినతులను తీసుకుని సమస్యల పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. వినతులను స్వీకరించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి సమస్యలు పరిష్కారం అవ్వాలని ఆదేశాలిస్తున్నారు. సమస్య పరిష్కారమైందో లేదో తనకు అప్‌డేట్ చేయాలని సూచిస్తున్నారు.
వైఎస్సార్సీపీ నేతల భూకబ్జాల ఫిర్యాదులే ఎక్కువ: ఈ క్రమంలో ఎన్టీఆర్ భవన్‌లో మంత్రి సవిత వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వైఎస్సార్సీపీ నేతలే ఇంకా తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. 'కక్షసాధింపు చర్యలు వద్దు' అని సీఎం చంద్రబాబు ఆదేశాలతో తమ వాళ్లు ఎదురుతిరగట్లేదని తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై ఒక్క అక్రమ కేసు కూడా తాము పెట్టట్లేదని మంత్రి అన్నారు.
చట్టం తన పని చేసుకుంటూ పోతోందని తెలిపారు. వైఎస్సార్సీపీ బాధితులు ఎందరో తమ వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నేతలు చేసిన భూకబ్జాలు, గంజాయి బారినపడిన బిడ్డల భవిష్యత్తు నాశనమైందన్న ఫిర్యాదులే ఎక్కువ వస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు.
విశాఖ ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై స్పందించిన సీఎంవో
ఇక్కడకు ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారిలో వైఎస్సార్సీపీ బాధితులే ఎక్కువగా ఉన్నారు. వైసీపీ నేతల భూకబ్జాలపై అత్యధికంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైఎస్సార్సీపీ నేతలే ఇంకా టీడీపీ వారిపై దాడులు చేస్తున్నారు. కానీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు ఎదురుతిరగట్లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులపై ఒక్క అక్రమ కేసు కూడా తాము పెట్టలేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతోంది. ఎవరు తప్పుచేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు.- సవిత, మంత్రి
మంత్రి లోకేశ్ చొరవ - కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్న శివ - TELUGU WORKER SHIVA COME TO AP