ETV Bharat / state

'ప్రజలు కోరుకున్నట్లు, రైతు సమస్యలు తీరేట్లు - త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం' - New Revenue Act 2024 in Telangana - NEW REVENUE ACT 2024 IN TELANGANA

రాష్ట్రంలో త్వరలోనే నూతన రెవెన్యూ చట్టం-2024 తీసుకురానున్నట్లు ప్రకటించిన మంత్రి పొంగులేటి - ఎంసీహెచ్‌ఆర్‌డీలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో విస్తృత స్థాయి సమావేశం

New Revenue Act-2024 in Telangana
New Revenue Act-2024 in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 6:47 AM IST

Updated : Oct 7, 2024, 8:15 AM IST

New Revenue Act-2024 in Telangana : దేశానికి రోల్ మోడల్‌గా ఉండేట్లు కొత్త రెవెన్యూ చట్టం-2024ను తీసుకురానున్నట్లు రాష్ట్ర సర్కార్‌ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పోర్టల్‌తో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల నుంచి విముక్తి చేసేందుకు వీలుగా ఈ చట్టం ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆదివారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశమయ్యారు.

ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి : ప్రజలు కోరుకున్నట్లు, రైతుకు సమస్యలు పరిష్కారమయ్యేట్లు సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండేలా చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాక ముందే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి తొందరపాటు చర్యలు తీసుకుని రైతులను సమస్యల కూపంలోకి నెట్టే పనిని తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు.

సలహాల స్వీకరణ : నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు ఉద్యోగులు, మేధావులు, నిపుణులు ఇలా అన్ని వర్గాలను సంప్రదించి సూచనలను, సలహాలను స్వీకరించినట్లు వివరించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టుల్లో ఎదురయ్యే లోటు పాట్లను కూడా పరిగణనలోకి తీసుకుని నూతన చట్టాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఉద్యోగుల ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆర్థికపరమైన అంశాలలో కసరత్తు చేయాల్సి ఉందని, పదోన్నతులు వంటి వాటిని తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను సృష్టిస్తామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. ఎన్నికలప్పుడు బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ స్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఉద్యోగులు చెప్పినట్టుగా అందరికీ ఒకే రకమైన వాహనాలు ఉండాలన్న ఆలోచన మంచిదే కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘ ప్రతినిధులకు తెలిపారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచి మౌలిక సదుపాయాలను విస్మరించిందని ఆరోపించారు. దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేవన్న మంత్రి, గత ప్రభుత్వం మాదిరిగా ఆర్భాటాలకు, హెచ్చులకు పోబోమన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడొద్దని, వాటి పరిరక్షణకు అధికారుల సూచన మేరకు ప్రతి మూడు నెలలకోసారి లీగల్ టీమ్‌లతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

యూనిక్ నెంబర్‌తో స్మార్ట్‌కార్డు- హెల్త్ ప్రొఫైల్‌ పైలట్​ ప్రాజెక్టుపై మంత్రి పొంగులేటి కీలక విషయాల వెల్లడి - Digital Health Profile Card Project

ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కానివ్వొద్దు : మంత్రి పొంగులేటి - Ponguleti On Revenue Issues

Last Updated : Oct 7, 2024, 8:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.