ETV Bharat / state

దేశానికి దశ దిశ చూపిస్తా అంటూ సొంత ఊరోళ్లకే పంగ నామం : కేసీఆర్‌పై పొంగులేటి ఫైర్ - Minister Ponguleti on Chintamadaka

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 9:05 PM IST

Minister Ponguleti on Chintamadaka : దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్బాలు పలికిన కేసీఆర్‌, ఊరోళ్లకే పంగ నామాలు పెట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. తన పుట్టినిల్లు అయిన చింతమడక గ్రామంలో సీఎం హోదాలో పర్యటించిన కేసీఆర్‌, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇళ్లన్నీ కూల్చేసి, ఇప్పటి వరకు వారికి నిలువ నీడ లేకుండా చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Minister Ponguleti slams KCR
Minister Ponguleti on Chintamadaka (ETV Bharat)

Minister Ponguleti slams KCR : గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలంతా ఫామ్‌హౌజ్‌లు కట్టుకుని పేదలకు ఇంటి సౌకర్యాలను విస్మరిస్తే, ఇప్పుడు వారందరికీ నివాస వసతిని కల్పిస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల మేలు కోరే ప్రభుత్వమని, అందుకే ఇందిరమ్మ రాజ్యం అని గర్వంగా చెప్పుకుంటున్నామని మంత్రి తెలిపారు. తక్షణమే చింతమడకలో పర్యటించి ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇల్లు పాయే, గుడిసె పాయే : ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడూ ఇళ్లు లేకుండా ఇబ్బంది పడకూడదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎలాంటి భేషజాలకు పోకుండా వీలైనంత త్వరగా చింతమడకలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చింతమడకలో పేదల కష్టాలపై స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్వాకం వల్ల ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా ఉందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను నమ్ముకుంటే ఉన్న ఇల్లు పాయె, గుడిసె పాయె విధంగా ఉందని విమర్శించారు.

ఊరోళ్లకే పంగ నామాలు : తన పుట్టినిల్లు అయిన చింతమడక గ్రామంలో సీఎం హోదాలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చివేసి ఇప్పటివరకు వారికి నిలువ నీడ లేకుండా చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్పాలు పలికిన కేసీఆర్‌, ఊరోళ్లకే పంగ నామాలు పెట్టారని విమర్శించారు. చింతమడకలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తానని 22 జులై 2019లో ఆర్భాటంగా కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.

పెద్ద సారు చేసిన ప్రకటనను నమ్మి తమ ఇళ్లను, గుడిసెలను అక్కడి నిరుపేదలు సర్కారుకు అప్పగించగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వాటిని కూల్చారని మంత్రి వివరించారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మేరకు లబ్ధిదారులను గుర్తించి 1909 ఇళ్లను అధికారులు మంజూరు చేశారని, కానీ 1215 ఇళ్లను నిర్మించడానికి మాత్రమే కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకుని మిగతా 694 ఇళ్లకు అగ్రిమెంట్ జరగలేదన్నారు.

నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని, గత ఏడాది డిసెంబర్ నాటికి నాలుగు సంవత్సరాలలో 1103 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. ఇంకా 148 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు ఉన్న ఇంటిని, గుడిసెలను కోల్పోయి రోడ్డున పడ్డాయని మంత్రి పొంగులేటి వివరించారు. పలువురు పేదలు పొలంగట్ల దగ్గర గుడిసెలు వేసుకున్నారని మరి కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస పోయారని మంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది : మంత్రి పొంగులేటి - Minister Ponguleti Fires On BRS

ఈ నెల చివరి కల్లా రూ.24 వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం : మంత్రి పొంగులేటి - Minister Ponguleti khammam Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.