ETV Bharat / state

"అగ్రిగోల్డ్‌ భూ వ్యవహారంలోనే జోగి రాజీవ్‌ అరెస్టు- రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటు" - ParthaSarathy on Jogi Rajeev Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 3:26 PM IST

Minister Partha Sarathy on Jogi Rajeev Arrest Issue: అగ్రిగోల్డ్‌ భూ వ్యవహారంలోనే మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ అరెస్టయ్యారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజకీయ కక్షతో అరెస్ట్‌ చేస్తున్నామంటూ వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. వైఎస్సార్సీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

Minister Partha Sarathy
Minister Partha Sarathy (ETV Bharat)

Minister Partha Sarathy on Jogi Rajeev Arrest Issue : అగ్రిగోల్డ్‌ భూ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినందు వల్లే మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడిని అరెస్టు చేసినట్లు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో అరెస్ట్‌ చేస్తున్నామంటూ వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి ఈ విషయంపై మాట్లాడారు. జోగి రాజీవ్​ను అరెస్టు చేయటంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని మంత్రి పార్థసారథి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. చట్టానికి కుల, మతాలతో సంబంధం ఉండదని ఆయన పేర్కొన్నారు.

జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యుల పాపం పండింది: మంత్రుల ధ్వజం - AP MINISTERS ON JOGI RAJEEV ARREST

ప్రభుత్వం నిజంగానే కక్ష సాధింపులకు పాల్పడినట్లైతే జోగి రమేష్‌ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదని మంత్రి పేర్కొన్నారు. చట్ట పరంగానే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పార్థసారథి తెలిపారు. సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారన్నారు. అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను కొనడం ఎంతవరకు సబబు? తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కొనుగోలు చేశారని లేవనెత్తారు. అగ్రి గోల్డ్‌లో డిపాజిట్‌లు చేసి పేదలు నష్టపోయారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్‌మెంట్‌లో ఉన్న తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అగ్రిగోల్డ్ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు.

సర్వే నెంబర్‌ మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారు : జోగి రాజీవ్ అరెస్టుపై ఏసీబీ ఏఎస్పీ - ACB ASP on Jogi Rajeev Arrest

గతంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ అధికార దుర్వినియోగంతో చట్ట వ్యతిరేకంగా భూములు కొని విక్రయించారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా అగ్రిగోల్డ్ ఆస్తులు సొంతం చేసుకోవాలని ప్రయత్నించిందని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ వ్యవహారానికి కులం, మతం అంటూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటి నుంచి రాజకీయ కక్ష సాధింపు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తున్నారని గుర్తు చేశారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఆనాడు జగన్ కక్షపూరితంగా రద్దు చేయించారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు.

అగ్రిగోల్డ్​ భూముల కబ్జా - మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్‌ అరెస్ట్​ - Remand for Jogi Rajeev

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.