ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని జగన్ కేంద్రానికి లేఖ రాశారు : మంత్రి నిమ్మల - Polavaram project issue on Council

Minister Nimmala Ramanaidu Spoke at Legislative Council : పోలవరం ప్రాజెక్టుపై శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని గత ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారన్నారు.

Minister Nimmala Ramanaidu Spoke at Legislative Council
Minister Nimmala Ramanaidu Spoke at Legislative Council (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 10:41 PM IST

Updated : Jul 26, 2024, 10:50 PM IST

Minister Nimmala Ramanaidu Spoke at Legislative Council : పోలవరం ప్రాజెక్టును ఎత్తును తగ్గించాలని 2022 జనవరి 10వ తేదిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. అప్పటి తెలంగాణ సీఎంతో జగన్ కుమ్మక్కై పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించారని శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు నిమ్మల రామానాయుడు సమాధానంగా చెప్పారు.

పోలవరంపై కేబినెట్​లో చర్చ- నిధులన్నీ కేంద్రమే ఇవ్వాలని తీర్మానం - Polavaram Project Funds

పోలవరంని బ్యారేజీగా మార్చే కుట్ర : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టులో ఎత్తును తొలుత నిర్ణయించినట్లుగానే 45.72 మీటర్లకు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయనున్నట్లు సభ్యులకు వివరించారు. ఈ మేరకు మంత్రి వర్గం సమావేశమై తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల వద్ద 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి చేటు చేయడమే కాకుండా బ్యారేజీగా మార్చే ప్రయత్నం చేసిందని అన్నారు.

మరోసారి అధికారంలో వచ్చి ఉంటే? : ఎత్తు తగ్గించడం వల్ల నిర్మాణ అంచనా వ్యయం 55వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు తగ్గి కేంద్రం నుంచి 10 నుండి 15 వేల కోట్ల నిధులను తెచ్చుకుని దారి మళ్లించుకోవాలన్నదే జగన్ ఆలోచన అని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిగెత్తించి 72 శాతం పూర్తి చేశారని వివరించారు. మరోసారి అధికారంలో వచ్చి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదన్నారు.

ముందుకు వెళ్లకపోగా - 20 ఏళ్లు వెనక్కి : దురదృష్టవశాత్తు జగన్ అధికారంలోకి రావడంతో మిగిలిన పనులు ముందుకు వెళ్లకపోగా జరిగిన పనులు 20 ఏళ్లు వెనక్కి వెళ్లాయని విమర్శించారు. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును జగన్ పూర్తిగా ధ్వంసం చేశారని మంత్రి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం సహా నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

గుత్తేదారు మార్పే పోలవరానికి శాపం- స్పష్టంచేసిన కేంద్రం - Polavaram Issue in Lok Sabha

పోలవరం ప్రాజెక్ట్​పై తొలగిన నీలినీడలు - నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం - Centre to Fully Finance Polavaram

Last Updated : Jul 26, 2024, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.