Minister Nimmal Video Conference with Irrigation Officials: వరదల కారణంగా దెబ్బతిన్న కాలువలు డ్రెయిన్లు, చెరువులు రిజర్వాయర్లు, ఏటి గట్లకు పడిన గండ్లను తక్షణం గుర్తించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గుర్తించిన గండ్లను అత్యవసర పనులుగా పెట్టుకుని వెంటనే పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఇరిగేషన్, సీఈ, ఎస్ఈ, ఈఈ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీ.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏలేరు రిజర్వాయర్ చరిత్రలోనే అత్యధికంగా 45,000 క్యూసెక్కుల నీరు వచ్చినా వరద నిర్వహణ సరిగా చేయడం వల్ల నష్ట స్థాయిని తగ్గించగలిగామని మంత్రి వివరించారు.
ధవళేశ్వరం నుంచి ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదులుతున్నామని సాయంత్రానికి ఇది మరింతగా పెరిగి 10 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశముందని మంత్రి వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కొల్లేరు అవుట్ ఫ్లో పెంచేందుపకు అడ్డంకిగా ఉన్న కిక్కిస గడ్డిని పంట్లపై యంత్రాలు పెట్టి తొలగించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం వరద నీటితో రాయలసీమకు సంబంధించి రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నింపుకొని ప్రతిరోజూ నివేదిక అందించాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి- ఎడతెరిపిలేని వర్షాలతో ప్రమాదకరంగా వాగులు - Heavy rains in Uttarandhra