Minister Narayana Press Meet on Amaravati: అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కెనాల్స్‌ను డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను డిజైన్ చేసినట్లు తెలిపారు. వీటిపై ఏడీసీ ఛైర్మన్, అధికారులతో చర్చించామని వివరించారు. వచ్చే వర్షాకాలానికి ఈ కాల్వలను పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉండవల్లి, వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్లు ప్లాన్ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్కులు వెళ్లేలా ప్రణాళిక రచించినట్లు తెలిపారు. అలానే బకింగ్‌హామ్ కెనాల్ వద్ద 4 వేల క్యూసెక్కులు, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కులు వెళ్లేలా ప్రణాళిక ఉందని అన్నారు. ఇవన్నీ పూర్తయితే అమరావతిలో వరద సమస్య ఉండదని తెలిపారు. ఎంత వరద వచ్చినా కెనాల్‌లో స్టోర్ అయ్యే విధంగా ప్రణాళిక ఉంటుందని అన్నారు. మొత్తం నీటి నిల్వ కోసం 6 రిజర్వాయర్లు ప్లాన్ చేశామని అన్నారు. నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల నీరు నిల్వ చేసేలా, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీల నీరు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీలు, లామ్ వద్ద 0.3 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీల నీరు నిల్వ చేసేలా రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు.
ఒకేరోజు 13,326 గ్రామసభలు - గుర్తించిన ప్రపంచ రికార్డు యూనియన్ - World Record in Holding Gram Sabhas
ఎంత వర్షం వచ్చినా కెనాల్, రిజర్వాయర్లలో ఇంకా ఎక్కువొస్తే పంపింగ్ స్టేషన్లు ఉంటాయని అన్నారు. వైఎస్సార్సీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని వివరించారు. 11.43 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకుని నిలబడగలిగామని అన్నారు. అమరావతి రాజధాని నగరంలో చాలా భద్రతతో కూడుకున్నదని వివరించారు. భవిష్యత్తులో అమరావతి గురించి ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దని రాజధానిగా అమరావతి సేఫెస్ట్ ప్రాంతమని తెలిపారు.
అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కెనాల్స్‌ను డిజైన్ చేయడం జరిగింది. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను డిజైన్ చేశాము. మూడు కెనాల్స్ గురించి ఏడీసీ ఛైర్మన్, అధికారులతో చర్చించాం. వచ్చే వర్షాకాలానికి 3 కాల్వలు పూర్తి కావాలని నిర్ణయించాం. ఉండవల్లి, వైకుంఠపురం వద్ద పంపింగ్ స్టేషన్లు ప్లాన్ చేశాము. ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్కులు, బకింగ్‌హామ్ కెనాల్ వద్ద 4 వేల క్యూసెక్కులు, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కులు వెళ్లేలా ప్రణాళిక ఉంది.- నారాయణ, మంత్రి