ETV Bharat / state

టీడీఆర్‌ బాండ్లలో అక్రమాలు - నివేదిక వచ్చాక చర్యలు: మంత్రి నారాయణ - Minister Narayana on TDR Bonds - MINISTER NARAYANA ON TDR BONDS

Minister Narayana on TDR Bonds: నెల్లూరు, కడపలో లేఅవుట్స్​లో జరిగిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కమిటీ వేయాలని ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు. తణుకు టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై పూర్తివివరాలు వెల్లడిస్తామన్నారు. 36 కోట్ల మేర ఇవ్వాల్సిన బాండ్లను 7వందల కోట్లకు ఇవ్వడం దారుణమన్నారు.

Minister Narayana on TDR Bonds
Minister Narayana on TDR Bonds (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 9:31 PM IST

Minister Narayana on TDR Bonds: రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేకుండా టీడీఆర్ బాండ్లు జారీ చేసేశారని మంత్రి పి.నారాయణ అన్నారు. మొత్తం 7 వందల కోట్లు మేర జారీ అయ్యాయన్నారు. బాండ్ల జారీ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేయాలని భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలు లేవని అన్నారు. 5 వేల 300 కోట్లు ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకు నుంచి రుణం తెస్తే, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులు వృథా చేశారని ఆరోపించారు.

2019 ఫిబ్రవరిలో తెచ్చిన రూ.5300 కోట్లలో కేవలం రూ.200 కోట్లే ఖర్చు పెట్టారని, కనీసం మ్యాచింగ్‌ ఫండ్‌ ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. గతనెల 30న గడువు ముగిసిందని, నిధులు ఖర్చు చేసి ఉంటే ఏపీలో 50 శాతం మున్సిపాలిటీలకు సౌకర్యాలు వచ్చేవన్నారు. ఆ ప్రాజెక్టును పొడిగించాలని కోరుతూ లేఖ పంపామన్నారు.

సమస్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి నారాయణ - Minister Narayana on municipalities

తాగునీటి కోసం తెచ్చిన అమృత్‌-1, 2 నిధులూ ఖర్చు చేయలేదని అన్నారు. అవి వినియోగించుకుంటే రాష్ట్రంలో తాగునీటి మౌలిక సదుపాయాలకు ఇబ్బంది ఉండేది కాదని అన్నారు. పట్టణ ప్రాంతల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలపై దృష్టి పెట్టామన్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీ నిధులు ఇష్టానుసారంగా వాడేసిందని, నిధులను దారి మళ్లించారని మంత్రి నారాయణ ఆరోపించారు.

నెల్లూరు, కడపలో లే అవుట్స్​లో అవకతవకలు జరిగినట్లు గుర్తించామన్నారు. లేఅవుట్‌ అనుమతుల్లో అక్రమాలపై కమిటీలు వేయాలని ఆదేశించామన్నారు. కమిటీల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. తణుకులో టీడీఆర్‌ బాండ్లలో అక్రమాలు జరిగాయన్న నారాయణ, రూ.36 కోట్ల మేర బాండ్లు ఇవ్వాల్సి ఉంటే రూ.700 కోట్ల మేర ఇచ్చారని ఆరోపించారు.

తణుకులో బాండ్ల విషయమై రేపు మరోసారి చర్చిస్తామని, బాండ్లు తీసుకున్న వారు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై చర్చిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీఆర్ బాండ్లు వ్యవహారంపై శాఖ పరమైన నివేదిక వచ్చిందని మంత్రి పి.నారాయణ తెలిపారు.

విభజన ఆస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: మంత్రి నారాయణ - Minister Narayana Review Officials

సచివాలయంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సమావేశమయ్యారు. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల అధికారులు హాజరయ్యారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థల నుంచి ఆదాయ, వ్యయాలు, అనుమతులు, అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులపై మంత్రి సమీక్షించారు.

మధ్యస్థాయి వర్గాలకు ఇళ్లు కట్టే ప్రాజెక్టును అర్బన్‌ అథారిటీ చేపట్టిందన్న నారాయణ, ఇళ్లు కట్టే కార్యక్రమం వివిధ స్థాయిల్లో ఉందని అన్నారు. ఆర్థిక సమస్యలపై సీఎంతో చర్చించి ముందుకు సాగుతామని, నీళ్లు, రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్‌ అందరికీ ముఖ్యమన్నారు. ఈ నాలుగు రంగాల బలోపేతం కోసం అర్బన్‌ అథారిటీస్‌ పెట్టారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక ప్రణాళిక లేకుండా పనులు చేపట్టిందని నారాయణ విమర్శించారు.

రాష్ట్రంలోని శాఖలన్నింటినీ వైఎస్సార్సీపీ నిర్వీర్యం చేసింది: మంత్రులు - Ministers Review Meetings

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.