ETV Bharat / state

విజయవాడలో భారీగా ఆహారం పొట్లాలు సిద్ధం - పంపిణీని పరిశీలించిన మంత్రి నారాయణ - Narayana on Food Distribution - NARAYANA ON FOOD DISTRIBUTION

Minister Narayana on Food Distribution to Flood Victims : విజయవాడ ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇతర జిల్లాల నుంచి లారీల్లో ఆహారం,పండ్లు, వాటర్​ బాటిళ్లులను పెద్దయెత్తున విజయవాడకు చేరుకున్నాయి. సీఎం ఆదేశాలతో పెద్దఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.

MINISTER ON FOOD DISTRIBUTION
MINISTER ON FOOD DISTRIBUTION (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 11:50 AM IST

Minister Narayana on Food Distribution to Flood Victims : విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజూ వరద సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి అదపు సహాయ బృందాలు, బలగాలను తెప్పించారు. ఆహారం, పాలు, నీళ్లు, మందులను ప్రభుత్వం సమీకరించింది. సోమవారం ఆహారం అందించలేని ప్రాంతాలకు ఇవాళ కచ్చితంగా నిత్యావసరాలు చేరవేస్తామంటున్న మంత్రి నారాయణ వెల్లడించారు.

ఆహార ప్యాకెట్ల పంపిణీని పరిశీలించిన మంత్రి : విజయవాడలో భారీగా ఆహారం పొట్లాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందని మున్సిపల్​ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సృష్టం చేశారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ఆహారం, పాలు, తాగునీటి ప్యాకెట్లుతో పాటు పండ్లు ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకున్నాయని పేర్కొన్నారు. వరద ముంపు బాధితులకు ఆహార ప్యాకెట్ల పంపిణీని ఆయన పరిశీలించారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం - ఊళ్లకు ఊళ్లే నీటమునక - Flood Effect in Joint Guntur

సీఎం ఆదేశాలతో పెద్దఎత్తున ఆహారం పంపిణీ : వరద ప్రభావం ఎక్కువగా ఉన్నా ప్రాంతాల వారికి ఆహార పంపిణీ జరగలేదని మంత్రి నారాయణ సృష్టం చేశారు. ఇవాళ బాధితులందరికి ఆహార ప్యాకెట్లు పంపిణీ జరగలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలియజేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆహారం పంపిణీ చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, రాజమహేంద్రవరం మున్సిపాలిటీలతో పాటు హరే కృష్ణ మూవ్​మెంట్​ సహా పలు కంపెనీలకు ఆహారం తయారీ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. మొత్తం 6 లక్షల ఆహారం ప్యాకెట్లు, 6 లక్షల వాటర్​ బాటిళ్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

కృష్ణానది మహోగ్రరూపం - కరకట్ట వెంబడి ప్రమాద ఘంటికలు - flood to krishna river karakatta

అన్నవరం దేవస్థానం నుంచి : విజయవాడ వరద బాధితులకు కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం నుంచి ఆహారాన్ని సిద్దం చేసి పంపించారు. సుమారు 10 వేల మందికి సరిపడా పులిహోర, తాగునీరు ని ప్యాకెట్లను సిద్ధం చేసి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. బాధితులకు పంపిణీ చేసేందుకు దేవస్థానం సిబ్బంది కూడా వెళ్లారు. వరద ప్రభావం తగ్గే వరకు మరింత మందికి ఆహారం పంపించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు.

వరద ధాటికి సొంతూళ్లకు పయనం - బస్సుల్లేక బస్టాండ్‌లో బాధితుల తిప్పలు - PEOPLE FACE TO TRANSPORT PROBLEM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.