ETV Bharat / state

టెస్లా ప్రధాన కార్యాలయంలో మంత్రి లోకేశ్ - పెట్టుబడుల వేటలో కీలక పరిణామం - NARA LOKESH MET TESLA CFO

మూడో రోజూ బీజీగా సాగుతున్న మంత్రి లోకేశ్‌ అమెరికా పర్యటన - టెస్లా, పెరోట్‌ గ్రూప్‌ ప్రతినిధులతో భేటీ

minister_nara_lokesh_meets_tesla_cfo
minister_nara_lokesh_meets_tesla_cfo (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2024, 1:57 PM IST

Minister Nara Lokesh Meets Tesla CFO : రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేశ్ మూడో రోజూ అమెరికాలో బీజీబీజీగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా లోకేశ్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. తాజాగా అమెరికా ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ముందంజలో ఉన్న టెస్లా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో లోకేశ్ భేటీ అయ్యారు.

చంద్రబాబు నేతృత్వంలో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. తమ లక్ష్యసాధనకు టెస్లా సహాయ, సహకారాలు అవసరమని కోరారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. అనంతపురం జిల్లాలో టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

గుడ్ న్యూస్ - త్వరలో విశాఖకు ఏవియేషన్‌ వర్సిటీ, డాటా సెంటర్‌!

రాష్ట్రవ్యాప్త EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో టెస్లా పాలుపంచుకోవాలని కోరారు. ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించిన టెస్లా ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని టెస్లా CFOకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్ గా ఉందని వైభవ్ తనేజా తెలిపారు. ఇంటి నుండి గ్రిడ్ వరకూ బ్యాటరీ పవర్ స్టోరేజీ పరికరాలు, సోలార్ ప్యానల్స్, సోలార్ షింగిల్స్, డ్రైవింగ్ ఇన్నొవేషన్, మోడల్ -3, పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా ఇంధనరంగంలో స్థిరమైన వృద్ధి సాధిస్తున్నట్లు వివరించారు.

అలాగే అమెరికా డల్లాస్ లో పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. పెరోట్ జూనియర్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో విభిన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించాలని రాస్ పెరోట్ జూనియర్ ను లోకేశ్ కోరారు.

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ అమెరికా పర్యటన - పారిశ్రామిక వేత్తలతో రౌండ్​టేబుల్ సమావేశం

ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్, పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో పెరోట్‌ సంస్థ వినూత్న విధానాలు తమ రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయని ఆకాంక్షించారు. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉందని వివరించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఏవియేషన్ యూనివర్సిటీ సహా ఏరోస్పేస్ టెక్నాలజీలో ఏపి ఆకాంక్షలు నెరేవేర్చడం, ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో పెరోట్‌ సంస్థ అనుభవం, సహకారం ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, ఏరోస్పేస్‌లో గ్లోబల్ ప్లేయర్‌లను ఆకర్షించడానికి రాస్‌ పెరోట్‌ నైపుణ్యం తమకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పిపిపి ప్రాతిపదికన భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాలని కోరారు.

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికా పర్యటన - అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.