YSRCP Fake Campaign on Tanuku Anna Canteen Says Minister Nara Lokesh : అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్మటం కొనసాగిస్తూనే ఉన్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. విష ప్రచారం చేసేందుకే వైఎస్సార్సీపీ సైకో బ్యాచ్ తణుకు అన్న కాంటీన్‌లో చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసిందని ధ్వజమెత్తారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉన్నారని స్పష్టం చేశారు.
చేతులు కడుగు స్థలంలో వైఎస్సార్సీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి వీడియో తీసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హరే కృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారుల నుంచి వివరాలు తీసుకున్న మంత్రి నారాయణ ప్లేట్లను మురికి నీటిలో కడుగుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని అధికారులు చెప్పారని తెలిపారు. వాష్ బేసిన్‌లోని పేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒకేసారి అన్న క్యాంటీన్‌కి ఎక్కువ మంది రావడంతో ప్లేట్లను డస్ట్ బిన్‌కు బదులుగా వాష్ బేసిన్‌లో పెట్టారని అధికారులు తెలిపారని మంత్రికి వివరించారు. అన్న క్యాంటీన్లలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయన్న హరే కృష్ణ మూమెంట్ ప్రతినిధులుసోషల్ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు.
Minister Nara Lokesh Fires on YSRCP About Tanuku Anna Canteen Issue : 2014 - 2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లు నిరుపేదలకు పట్టెడన్నపెట్టేవి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని మూసివేసి సామాన్యులకు అన్యాయం చేసింది. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంట్టుకున్న విషయం తెలిసిందే. 203 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించినా, మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అన్న క్యాంటీన్లు పునఃప్రారంభానికి సర్వం సిద్ధం - Reopening of Anna Canteens