Minister Nara Lokesh Fires on YS Jagan: వైఎస్సార్సీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ జనం సొమ్ము 28 లక్షలు దోచేశారని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దుయ్యబట్టారు. జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్లలా 28 లక్షలు దిగమింగేశారని ఆరోపించారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేదలకు మంజూరు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారని విమర్శించారు. దోపిడీకి హద్దులేదా జగన్, ప్రజాధనం మెక్కడానికి సిగ్గులేదా అని లోకేశ్ ధ్వజమెత్తారు.
జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్ల కోసం 28 లక్షలు దిగమింగేశారని ఆరోపించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని లోకేశ్ పేర్కొన్నారు.
Lokesh on Alluri Sitarama Raju Birth Anniversary: స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళి అర్పించారు. అల్లూరి సీతారామరాజు తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అని పిలుపునిచ్చారని లోకేశ్ పేర్కొన్నారు.
Lokesh on Pingali Venkayya Death Anniversary: మువ్వన్నెల జాతీయ పతాకం రూపకర్త, తెలుగుజాతి కీర్తి పతాకం పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు. మన గుండెల నిండా ఉన్న జాతీయ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగు వారు కావడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.
Lokesh Visit Temple: మంత్రి నారా లోకేశ్ నేడు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠం రాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి, పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడానికి ప్రణాళిక సిద్ధం చెయ్యాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు.
సీఎం 4.0ను చూస్తారు - చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ - Chandrababu and Lokesh Conversation
దోపిడీకి హద్దులేదా జగన్? ప్రజాధనం పందికొక్కులా మెక్కడానికి సిగ్గులేదా? జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్లలా 28లక్షలు దిగమింగేశావు. వైసీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ జనం సొమ్ము 28 లక్షలు దోచేశారు. ఆ… pic.twitter.com/i3J4byS3ZV
— Lokesh Nara (@naralokesh) July 4, 2024
మువ్వన్నెల జాతీయ పతాకం రూపకర్త, తెలుగుజాతి కీర్తి పతాకం పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మన గుండెల నిండా ఉన్న జాతీయ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య గారు మన తెలుగు వారు కావడం తెలుగుజాతికి గర్వకారణం. pic.twitter.com/0Gbls8GwBD
— Lokesh Nara (@naralokesh) July 4, 2024
తెలుగు వీర లేవరా..
— Lokesh Nara (@naralokesh) July 4, 2024
దీక్షబూని సాగరా..
దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా..
అని పిలుపునిచ్చి
స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. pic.twitter.com/1nwC2x86Qt