ETV Bharat / state

తెలంగాణ బోనాల పండగకు వేళాయే - జులై 7 నుంచే మహా జాతర ప్రారంభం - Bonalu Festivals 2024

Telangana Bonalu Festival Time : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ. బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్​ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జులై 7వ తేదీ నుంచి బోనాల జాతర షురూ అవుతుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బోనాలకు కావాల్సిన నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. బోనాల పండుగకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.

Minister Konda Surekha Review on Bonalu Jathara
Telangana Bonalu Festival Time (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 9:24 PM IST

Minister Konda Surekha Review on Bonalu Jathara : రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండగను అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బోనాల పండగను ఘనంగా నిర్వహించేందు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 7వ తేదీ నుంచి బోనాల జాతర ప్రారంభమవుతుందని తెలిపారు. బోనాల మహా జాతర ఏర్పాట్లపై అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జూబ్లీహిల్స్​లోని ఎంసీహెచ్​ఆర్డీలో ఆషాఢ మాసం బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్​ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

నామినేట్ మంత్రులతో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ : గతంలో మాదిరిగా అరకొర నిధులతో, అసౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. బోనాల పండుగకు రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసేలా సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడుతానని తెలిపారు. బోనాల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. నగరంలో 28 ఆలయాలు ఉన్నాయని నామినేట్ చేసిన 9 మంది మంత్రులతో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తామని చెప్పారు.

బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండటం వల్ల ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్లుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాల్లో కళాబృందాలను తీసుకురావడంతో పాటు, లేజర్ షోలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Bonalu Calendar 2024 : దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగు నీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం, వైద్య సహాయ క్యాంప్​లు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో పాటు ప్రజల అవసరాల కోసం హెల్ప్​లైన్ అందుబాటులో ఉంచుతామన్నారు. త్వరలో బోనాల తేదీలను పూర్తి సమాచారంతో కూడిన క్యాలెండర్​ను విడుదల చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాలయాలకు వెళ్లే దారులన్నీ మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, విద్యుత్​ దీపాలు మరమ్మతు చేయాలన్నారు. అటవీశాఖ తరఫున అంబారి ఊరేగింపు కొరకు ఏనుగును తెప్పించడం వంటి కార్యక్రమాలు చూసుకోవాలన్నారు.

Govt Focus on Bonalu Preparations : టీజీఎస్ఆర్టీసీ వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ అన్నారు. రోడ్లు భవనాల శాఖ దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, అవసరమైన ప్రదేశాల్లో బారికేడ్లు నిర్మించాలన్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అదనపు విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లను, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు.

Charminar Bonalu Drone Visuals : చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలు.. డ్రోన్​ విజువల్స్ చూశారా..?​

Politicians at Lal Darwaza Bonalu 2023 : రాజకీయాలకు అతీతంగా భాగ్యనగరంలో 'బోనాల సంబురం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.