ETV Bharat / state

రాష్ట్రంలో ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తాం : మంత్రి కోమటిరెడ్డి - Komatireddy comments on roads

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 4:00 PM IST

Updated : Jul 12, 2024, 4:26 PM IST

Minister Komatireddy Review with R and B Officials : రాష్ట్రంలో ప్రతి సింగిల్‌ రోడ్డును డబుల్‌ రోడ్డుగా మారుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం అవసరమైతే రుణాలు సేకరించడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ రోడ్స్ ఫండ్ తీసుకురావడం, సేతుబంధు లాంటి కొత్త పథకాలు ప్రవేశపెడతామని ప్రకటించారు.

Minister Komatireddy
Minister Komatireddy Review with R and B Officials (ETV Bharat)

Minister Komatireddy Review on Roads and Buildings : రాష్ట్రంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెట్టి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం అవసరమైతే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు సేకరించడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ రోడ్స్ ఫండ్ (సీఆర్‌ఎఫ్ నిధులు) తీసుకురావడం, సేతుబంధు లాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఆ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్ బీ ఈఎన్‌సీ కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఈఎన్‌సీలు గణపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సీఈ మోహన్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖలో జోనల్, సర్వీసు రూల్స్‌పై కొన్ని సవరణలు చేయాల్సిన ఆవశ్యకతపై విస్తృతంగా చర్చించారు. ఆర్‌ అండ్ బీ శాఖ సర్వీసు రూల్స్‌లో పదోన్నతుల్లో అన్యాయం జరిగిన అధికారులు, సిబ్బందికి న్యాయం చేసేందుకు శాఖాపరంగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరో వారం, పది రోజుల్లో ఆయా సమస్యలు పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం ద్వారా తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖను మంచి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద రోడ్డు, ఇన్ని నిధులు అవసరమా? అన్న ప్రశ్నల నేపథ్యంలో హైదరాబాద్‌ చుట్టూ బాహ్యవలయ రహదారి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

హైదరాబాద్ టూ యాదాద్రి సూపర్ ఎక్స్​ప్రెస్ హైవే కట్టబోతున్నాం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి - koamtireddy on highway To yadadri

రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ వారంలో డీపీఆర్ : అదే రోడ్డుపై అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడమే కాకుండా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం నెలకొల్పి తెలంగాణను తలమానికంగా తీర్చిదిద్దామని, 3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతుల కారణం నాటి తమ ప్రభుత్వం ముందుచూపు అంటూ ప్రస్తావించారు. అలాగే 2016లో ప్రతిపాదిత ప్రాంతీయ బాహ్యవలయ రహదారి మంజూరుకు 2018లో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆక్షేపించారు. ఈ క్రమంలో తాను మంత్రి అయ్యాక ఎంపీగా ఉన్న అనుభవంతో చేస్తున్న కృషిలో భాగంగా సెప్టెంబర్, అక్టోబరులో టెండర్లు పిలిచి డిసెంబర్‌లో ప్యాకేజీల వారీగా ప్రాంతీయ బాహ్య వలయ రహదారి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ వారంలో డీపీఆర్ పిలిచి, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి సెప్టెంబరు మాసం చివరలోనే ఆరు లైన్ల రహదారిగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

రోడ్లు చెడిపోతే కాంట్రాక్టర్లతో పాటు అధికారులు కూడా బాధ్యత వహించాల్సిందే : మంత్రి కోమటిరెడ్డి - minister komatireddy venkat reddy

Last Updated : Jul 12, 2024, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.