ETV Bharat / state

రోడ్లు, ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - Minister Komatireddy on Road Works

Minister Komatireddy Review on Roads : రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని, వెంటనే పెండింగ్​లో ఉన్న రోడ్ల పనులతో పాటు ఆస్పత్రుల భవన నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో సమీక్షించిన ఆయన, సచివాలయంలో కూడా 30 కోట్ల రూపాయలతో తలపెట్టిన పార్కింగ్ పనులకు టెండర్లను పిలిచి పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Minister Komatireddy Venkat Reddy on Pending Roads
Minister Komatireddy Review on Roads (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 10:07 PM IST

Minister Komatireddy Venkat Reddy on Pending Roads : రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని, అధ్వాన్నంగా మారిన రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆర్అండ్​బీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అధికారులను ఆదేశించారు. గత అయిదేళ్లుగా రోడ్లు నిర్మించక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ ప్రభుత్వం రాగానే వెంటనే కార్యాచరణ చేపట్టినప్పటికీ ఎన్నికల కోడ్ రావడం వల్ల రోడ్ల నిర్మాణ పన్ను వల్ల పనులన్ని పెండింగ్​లో పడిపోయాయని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం ప్రారంభించి 24 గంటలు పనిచేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి టిమ్స్, నిమ్స్, హైదరాబాద్ కలెక్టరేట్, సచివాలయంలో రోడ్లు, పార్కింగ్ తదితర అంశాలపై మాట్లాడారు. సచివాలయంలో 30 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన పార్కింగ్ పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు. పార్కింగ్ షెడ్స్ లేకుండా బిల్డింగ్ ప్లాన్​కు ఎలా అనుమతులు ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. సోలార్ పార్కింగ్​కు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు.

భవన నిర్మాణాల పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం : నాలుగు టిమ్స్ ఆస్పత్రుల భవన నిర్మాణాల జాప్యంపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణాలకు నిధుల కొరత లేకపోయినప్పటికీ పనుల్లో జాప్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైతే సగం భవనం నిర్మాణం పూర్తికాగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సమాంతరంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 2 వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సీఆర్ఐఎఫ్ పనులకు ఎన్నికల నియమావళి కారణంగా టెండర్లు పిలవలేకపోయామని, జూన్ 6 నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రికి అధికారులు తెలియజేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలతో పాటు అధికార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 6 నుంచి ఆరు రోజుల పాటు అమెరికాకు వెళ్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. సమావేశంలో ఆర్అండ్​బీ కార్యదర్శి విజయేందిరబోయి, ఈఎన్సీ గణపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Minister Komatireddy on Road Safety Measures : సచివాలయంలో గత నెల 17న కూడా మంత్రి కోమటిరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రహదారి భద్రతా చర్యలపై చర్చించారు. హైదరాబాద్‌‌-విజయవాడ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. సైన్ బోర్డులు, వేగ నియంత్రణ వంటి చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. రహదారిపై కొన్నిచోట్ల ఆరులేన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్​లు, సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి ప్రణాళికలు చేయాలన్నారు.

17 బ్లాక్ స్పాట్స్‌లలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు - మంత్రి కోమటిరెడ్డి రివ్యూ - Minister Komatireddy on Road Safety

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.