Minister Kandula Durgesh Inaugurated Hotels: టూరిజం ప్యాకేజీల ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు త్వరగా దర్శనం అయ్యేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుమలలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవరాగం హోటళ్లను ఆయన ప్రారంభించారు. టూరిజం దర్శనాలకు అధిక సమయం పడుతోందని భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఈ అంశాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. తిరుమలలో హోటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, టీటీడీ నిర్ణయించిన ధరలకే ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందిస్తామన్నారు. ఆహార నాణ్యత కోసం ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకుంటామన్నారు.రాష్ట్రంలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టూరిజంను అభివృద్ధి చేయవచ్చని, కానీ గత ప్రభుత్వం టూరిజంను పట్టించుకోలేదని ఆరోపించారు. టూరిజం శాఖలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తామన్నారు. తిరుపతిలో ఉన్న 30 ఎకరాల టూరిజం స్థలంలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా టూరిజంలో ఏపీ ప్రాముఖ్యత గురించి తెలుసని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా టూరిజం పై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.
"టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్లు అభివృద్ధి చేసిన ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలో సుమారు 40 హోటళ్లను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా తిరుమలలో కొన్ని రెస్టారెంట్లను ఏపీటీడీసీ వారిని అందించాము. పర్యాటక రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది". - మంత్రి కందుల దుర్గేష్
ప్రభుత్వానికి భారమైనా వెయ్యి రూపాయల పింఛన్ పెంచాం: మంత్రి కందుల - Pension Distribution on July 1st