బ్లాక్ మనీ వైట్ చేసుకునేందుకే జగన్ లండన్ పర్యటన : డోలా - Minister Dola on Jagan london tour - MINISTER DOLA ON JAGAN LONDON TOUR
Minister Dola on Jagan London Tour : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్ విలాసాల కోసం లండన్ పర్యటనకు వెెళ్తున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. సంపాదించుకున్న బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకునేందుకేనా? లండన్ పర్యటన అని ప్రశ్నించారు. లండన్ పర్యటన వెనుక ఉద్దేశం ఏంటో జగన్ రెడ్డి తెలపాలని నిలదీశారు.
![బ్లాక్ మనీ వైట్ చేసుకునేందుకే జగన్ లండన్ పర్యటన : డోలా - Minister Dola on Jagan london tour Minister Dola on Jagan London Tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-09-2024/1200-675-22372379-thumbnail-16x9-dola.jpg?imwidth=3840)
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2024, 2:15 PM IST
Minister Dola on Jagan London Tour : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే జగన్ విలాసాల కోసం లండన్ పర్యటనకు వెెళ్తున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. లండన్ పర్యటన వెనుక ఉద్దేశం ఏంటో జగన్ రెడ్డి తెలపాలని నిలదీశారు. వరద బాధితులకు అండగా సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడుతుంటే జగన్ ఆరగంట పరామర్శించి బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వరదల్లో ప్రజలు విలవిలలాడుతుంటే గతంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన జగన్ విలాసాల కోసం విదేశాలకు వెెళ్లటం ఏంటని ప్రశ్నించారు.
విధిలేని పరిస్థితుల్లో బురదలోకి : గతంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు జగన్ బాధితుల వద్దకు ప్రత్యక్షంగా వెళ్లిన సందర్భాలు ఒక్కటైన ఉందా? అని మంత్రి డోలా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పై సందర్శించారని మండిపడ్డారు. ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో బురదలోకి దిగారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వెకిలిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరదల గురించి మాట్లాడే అర్హత కూడా జగన్ కు లేదని అన్నారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో ఛీ కొట్టారని గుర్తుచేశారు.
బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకునేందుకేనా? : సంపాదించుకున్న బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకునేందుకేనా? జగన్ లండన్ పర్యటన అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ఏ కారణంతో లండన్ వెళ్తున్నారో ఆయన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయన లండన్ వెళ్తూ తన పేటిఎం బ్యాచ్‌తో పిచ్చి ప్రేలాపనలు చేప్పిస్తే ఊరుకునేది లేదని డోలా బాలవీరాంజనేయస్వామి హెచ్చరించారు.
లండన్‌లో అక్రమ ఆస్తులు : లండన్‌లో ఐదు చోట్ల జగన్‌కు అక్రమ ఆస్తులు ఉన్నట్లు సీబీఐ ఆనాడే గుర్తించిందని అన్నారు. లండన్‌లో దీవులు కొనుగోలు చేసినట్లు ప్రజలు చెబుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమ నాయకుడు ఎప్పుడూ క్షేత్రస్థాయిలోనే ఉన్నాడన్న ఆయన, జగన్‌లా హెలికాఫ్టర్లలో తిరగలేదని తెలిపారు. ఐదు నిమిషాలు షో చేసి అమరావతి, ప్రభుత్వంపై అబద్దపు బురదజల్లితే జగన్‌కు గుణపాఠం తప్పదని హెచ్చచారు. ప్రజలకోసం పనిచేసే నాయకుడు ఎవరో ప్రజలే గమనిస్తున్నారన్నారు. ప్రజలే జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు.