ETV Bharat / state

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు - అధ్యయనానికి రూ.2.27 కోట్ల నిధులు - GREEN FIELD AIRPORTS

రాష్ట్రంలో మరో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి - రూ.2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

green_field_airports
green_field_airports (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 8:40 PM IST

Minister BC Janarthan Reddy on Green Field Airports Proposals: రాష్ట్రంలో మరో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి రూ.2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని - అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలు ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదన ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా ఎయిర్ కనెక్టివిటీని, కార్గో సేవలను పెంచడం ద్వారా ప్రయాణికులకు మరింత విస్తృతంగా సేవలు అందించాలన్న ఆలోచన సాకారం అవుతుందని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలపై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపామని అన్నారు.

దీంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదిత ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తగిన భూమి గుర్తించి, నివేదికలు అందించాలని ప్రభుత్వాన్ని కోరిందని మంత్రి అన్నారు. దీనికి సంబంధించి కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జున సాగర్​లో 1670 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాలు, శ్రీకాకుళంలో 1383 ఎకరాలు, తుని – అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు ఎయిర్ పోర్టు అభివృద్ధికి తగిన భూమి అందుబాటులో ఉన్నట్లు కలెకర్ట్​ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఎయిర్ పోర్టుల అభివృద్ధికి గుర్తించిన భూమిలో అధ్యయనానికి ప్రాథమికంగా 9 అంశాలకు సంబంధించి ఒక సాంకేతిక కమిటీ అక్కడ అధ్యయనం చేయనుందని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో రిలయన్స్​ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ

అధ్యయనంలోని 9 అంశాలు:

  • ప్రతిపాదిత భూమిలో WGS - 84 వ్యవస్థ
  • రెవెన్యూ మ్యాప్
  • ప్రతిపాదిత భూమి లైన్ డైయాగ్రమ్ స్కెచ్
  • ప్రతిపాదిత భూమి విండోర్స్ డయాగ్రమ్
  • కాంటూర్ మ్యాప్
  • ప్రతిపాదిత సైట్​లో ప్లాన్ చేయబడిన క్రిటికల్ ఎయిర్ క్రాప్ట్ టైప్
  • 1:50000లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్
  • గత 10 ఏళ్లలో మెటలార్జికల్ డిపార్ట్​మెంట్ డేటా
  • టైప్ ఆఫ్ ఆఫరేషన్స్ డిసైర్డ్

సీఎం సూచనల మేరకు నిధులు: ఈ అధ్యయనం చేయడానికి ఒక్కో ఎయిర్ పోర్టుకు రూ. 37.87 లక్షలు ఖర్చు అవుతోందని మొత్తంగా ఈ 6 ఎయిర్ పోర్టులకు కలిపి దాదాపుగా రూ. 2.27 కోట్లు వ్యయం అవుతోందని సీఎం సూచనల మేరకు ఆ నిధులు కేటాయించినట్లు మంత్రి జనార్థన్ తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ఒక నిర్ణయానికి రానుంది. మరోవైపు ఇప్పటికే నెల్లూరు (దగదర్తి) ఎయిర్ పోర్టుకు సంబంధించి, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తగిన భూమి కోసం అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిందని మంత్రి వివరించారు.

స్టాక్​ మార్కెట్​లో లాభాల ఎర! - కోటి రూపాయలు పోగొట్టుకున్న సివిల్ ఇంజినీర్

"వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఆ ముగ్గురే కీలకం" : వర్రా రవీందర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.