Minister Aanam Review on Ghee Procurement: దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యి విషయంలో అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటిని నియమించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు. దేవాలయాలకు నెయ్యి సరఫరా తీరు తెన్నులపై వివిధ డెయిరీ సంఘాలు, సంస్థల ప్రతినిధులతో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయాల్లో వివిధ అవసరాల నిమిత్తం ఏటా సుమారు 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరమని, దీనిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో సేకరించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం తెలిపారు.
దేవాలయాలకు ఎన్ని డెయిరీల నుంచి నెయ్యి సరఫరా అవుతోంది తదితర అంశాలపై అధికారులు, డెయిరీల ప్రతినిధుల నుంచి సమాచారాన్ని మంత్రి తెలుసుకున్నారు. దేవాలయాలు డెయిరీల నుంచి నేరుగా నెయ్యిని సేకరించే విధానం అమలులో ఉండగా 2022లో దీనిని మార్చి, టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారని, టెండర్లలోని షరతులు, నిబంధనలు మొదలైనవాటి కారణంగా పలు డెయిరీలు సరఫరాకు వెనకడుగు వేశారని మంత్రి దృష్టికి తెచ్చారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంగం డెయిరీ ఛైర్మన్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.
మటన్, చికెన్ దగ్గర మీరే ఉండాలి - ఎంపీడీవో రిటైర్మెంట్ కార్యక్రమంలో ఉద్యోగులకు బాధ్యతలు
వేద విద్యను అభ్యసించే యువతకు సంభావన: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించిన యువతకు నెలకు రూ. 3 వేలు సంభావనగా వారికి ఇచ్చేందుకు త్వరలోనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి ఆనం తెలిపారు. పూర్వపు జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆలయాల్లో చదుర్వేద సదస్యాలను నిర్వహించాలని ఆదేశించామన్నారు. కార్తీకమాసంలో ఈ సదస్యలు ప్రారంభించాలని సంబందిత అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవస్థానాల్లో వేదపండితులతో చదుర్వేద సదస్యాలను జరపాలని ఆదేశించినట్లు చెప్పారు. గత హిందుత్వాన్ని విస్మరించిందని విమర్శించారు.
దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో రానున్న కార్తీకమాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవ, వైష్ణవ క్షేత్రాలు, ప్రముఖ దేవాలయాల్లో ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో పూజలు, అభిషేకాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని దేవాలయాలకు భక్తులు ప్రత్యేకంగా ఈ నెలలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు రానున్నారని అన్నారు. కార్తీకమాసం నెల అంతా భక్తుల తాకిడి దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసరమైన ఆరోగ్య సేవలు తదితర అంశాలపై ముందు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టంగా ఆదేశించామన్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు - గోదావరి పుష్కరాలు ఎప్పుడంటే
'జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి' - వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగలేఖ