ETV Bharat / state

గోరంత అనుమతితో కొండంత గ్రావెల్‌ తవ్వకాలు - లెక్కలు తేలుస్తున్న అధికారులు - Gravel Mining

Mining Authorities Calculating Gravel Mining in Krishna District: ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి తవ్వకాలు, ఆదాయ తీరుతెన్నులపై అధికారులు దస్త్రాలు తిరగేస్తున్నారు. జగనన్న కాలనీల పేరుతో ఆసలు రాయల్టీయే లేకుండా తవ్వుకెళ్లగా ఎక్కువగా విజయవాడ పరిసరాల్లో తవ్వకాలు జరిగాయి. గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వకాలు జరిపారు.

Mining Authorities Calculating Gravel Mining
Mining Authorities Calculating Gravel Mining (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 19, 2024, 12:20 PM IST

Updated : Jun 19, 2024, 4:43 PM IST

Mining Authorities Calculating Gravel Mining in Krishna District: కొండలు కొల్లగొట్టి, పోలవరం కాలువ కట్టలు కరిగించేసి, అటవీ, అసైన్డ్ భూముల్ని గుల్లచేశారు. ఆఖరికి చెరువులనూ ఛిద్రం చేశారు. అదేమని అడిగితే జగనన్న కాలనీల కోసమని ముసుగుతొడిగారు. రోడ్ల నిర్మాణం కోసమంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఐతే లక్షల కోట్ల ఘనపు మీటర్ల మట్టితో ఏ కాలనీని మెరకచేశారు. ఎక్కడెక్కడ రోడ్లు వేశారు? అసలు తీసుకున్న అనుమతులెంత? అడ్డదిడ్డంగా తవ్వేసుకున్నదెంత? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదు సంవత్సరాలపాటు సాగిన మట్టి దందాపై గనుల శాఖ అధికారులు లెక్కలు తెలుసుకుంటున్నారు.

ప్రైవేటు భూముల్లోనూ మట్టి తన్నుకుపోతున్న వైసీపీ గద్దలు- ప్రశ్నిస్తే బెదిరింపులు - Gravel mining

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి తవ్వకాలు, ఆదాయ తీరుతెన్నులపై అధికారులు దస్త్రాలు తిరగేస్తున్నారు. గనుల శాఖ లెక్కల ప్రకారం ఒక ఎకరంలో ఒక మీటరు లోతున తవ్వితే 400 టిప్పర్ల గ్రావెల్ వస్తుంది. విజయవాడ శివారులో ఒక టిప్పరు గ్రావెల్ 8 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దాని ప్రకారం ఎకరం మట్టి తవ్వితే 32 లక్షల వరకూ ఆదాయం వస్తుంది. టిప్పర్ల బాడుగ, ఇతర ఖర్చులు సగానికి సగం తీసినా 16 లక్షల రూపాయల మేర మిగులుతుంది. అనుమతులు తీసుకుని తవ్వితే ఘనపు మీటరుకు 109 రూపాయల చొప్పున గనుల శాఖకు చెల్లించాలి. అంటే ఎకరాకు 4 లక్షల 36 వేల చొప్పున గనుల శాఖకు రాయల్టీ చెల్లించాలి.

గత ఐదేళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వకాలు జరిపారు. వందల ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వేసుకెళ్లి వందల కోట్లలో ప్రభుత్వానికి రాయల్టీ ఎగవేశారు. జగనన్న కాలనీల పేరుతో ఆసలు రాయల్టీయే లేకుండా తవ్వుకెళ్లారు. ఎక్కువగా విజయవాడ పరిసరాల్లో తవ్వకాలు జరిగాయి. గన్నవరం పరిధిలో ఏ కొండ చూసినా మట్టి తవ్విన ఆనవాళ్లే. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు మండలాల్లో ప్రభుత్వ బంజరులు, అటవీ, రెవెన్యూ భూమి, చెరువులతోపాటు పోలవరం కుడికాలువ వెంట కూడా మట్టి తవ్వుకెళ్లారు.

రాష్ట్రంలో చెలరేగిపోతున్న మట్టిమాఫియా - చోద్యం చూస్తున్న అధికారులు - Illegal Gravel Mining

2019లో వైఎస్సార్సీపీ గద్దెనెక్కాక గన్నవరంలో 50 వేల క్యూబిక్ మీటర్ల మేర 20 ఎకరాల వరకూ గ్రావెల్‌ తవ్వకాలకు లీజులు మంజూరు చేశారు. ఐతే ఆరు నెలల్లోనే పరిమితిమేర తవ్వకాలు పూర్తి చేశారు. ఆ తర్వాత కొత్తగా అనుమతులివ్వలేదు. కానీ గొల్లనపల్లిలో 20 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిలో గ్రావెల్‌ తవ్వుతున్నారు. కొండపావులూరు,రంగన్నగూడెం, మల్లవల్లి పాతపాడులో పదేసి ఎకరాల్లో బిక్కవరం, నక్కలతిప్పలో ఐదేసి ఎకరాల చొప్పున తవ్వేశారు.

తెంపల్లి, గొల్లనపల్లి, బల్లిపర్రు, రంగన్నగూడెం,గోపవరపుగూడెం, పాతపాడు, అంబాపురం, అప్పారావుపేట పరిధిలో పోలవరం కట్టలను ఇరువైపులా దాదాపు 100 మీటర్ల చొప్పున రీచ్‌లు ఏర్పాటు చేసుకుని గండికొట్టినట్లు తవ్వారు. వీటికేవీ లెక్కలు లేవు. పోలవరం ప్రాజెక్ట్‌ అధికారులేమో తాము అనుమతులే ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. కొత్తూరు తాడేపల్లిలో గ్రావెల్ తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాల మేరకు కమిటీ పర్యటనకు వెళ్తే గతంలో మట్టి మాఫియా అడ్డుకున్నారు. వీటన్నింటి వెనుక నాటి వైఎస్సార్సీపీ మంత్రులు, ప్రజాప్రతి నిధులున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రావెల్ అక్రమ తవ్వకాల లెక్కలు ఆరా తీస్తున్నారు. కక్ష సాధింపులా కాకుండా ప్రభుత్వ వనరులను దోచిన వారి నుంచి రాయల్టీ కట్టించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు.

నాయుడుపేటలో యథేచ్ఛగా గ్రావెల్​ అక్రమ రవాణ - అడ్డుకున్న స్థానికులు - Illegal Transportation Gravel

Last Updated : Jun 19, 2024, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.