ETV Bharat / state

MGM CANCER INSTITUTE కొత్త తరహా చికిత్స- ఎముక మజ్జతో తలసేమియాకు చెక్ - MGM Cancer Institute Anamaya - MGM CANCER INSTITUTE ANAMAYA

MGM Cancer Institute Anamaya Program: తలసేమియా, ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్‌ బాధపడుతున్న పిల్లల కోసం చెన్నైలోని ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ 'అనామయ' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది తలసేమియాతో బాధపడుతున్నారు. ఎముక మజ్జ మార్పిడి తలసేమియాకు ఏకైక శాశ్వత పరిష్కారామని వైద్యులు తెలిపారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 7:48 PM IST

MGM Cancer Institute Anamaya Program : తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు చెన్నైలోని ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ శాశ్వత చికిత్స విధానం వైపు అడుగులు వేస్తోంది. ఈ చికిత్స విధానానికి 'అనామయ' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. పిల్లలు వ్యాధి రహిత జీవితాన్ని గడపడానికి సహాయపడే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తలసేమియా, ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్‌ను ప్రభావితం చేసే జన్యుపరమైన పరిస్థితి. దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది తలసేమియాతో బాధపడుతున్నారు.

అనామయ కార్యక్రమం ద్వారా, ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అలాగే గిరిజన ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. గత ఆరు నెలల్లో, ఈ సంస్థ సుమారు 5,000 మంది పిల్లల్లో తలసేమియా, ఇతర రక్త రుగ్మతలను పరీక్షించింది. తలసేమియాతో బాధపడుతున్న సుమారు 25 మంది పిల్లలను సంస్థ గుర్తించింది. వారికి సప్త ఫౌండేషన్ సహకారంతో ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్సను అందిస్తున్నారు. ప్రభుత్వం, ఎన్​జీఓలు, ఆసుపత్రి అందించే రాయితీల ద్వారా ఈ చికిత్స అందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో దాదాపు 10,000 మంది తలసేమియాతో బాధపడుతున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు 1,00,000 మంది రోగులు ఉన్నారు. వీరికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే, వ్యక్తి జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. చాలా మంది పిల్లలు తరచుగా రక్తమార్పిడి, గుండె, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలలో ఐరన్ ఓవర్‌లోడ్ కారణంగా 15 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించలేరు. ప్రస్తుతం ఎముక మజ్జ మార్పిడి (Bone Marrow Transplantation) తలసేమియాకు ఏకైక శాశ్వత పరిష్కారం. ఎముక మజ్జ మార్పిడి తర్వాత తలసేమియాతో బాధపడుతున్న పిల్లలు సాధారణ జీవితాన్ని గడపుతారు.

శరవేగంగా విస్తరిస్తున్న ఎంపాక్స్- ఈ లక్షణాలుంటే డేంజర్! - mpox symptoms

ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో పీడియాట్రిక్ హెమటాలజీ, ఆంకాలజీ విభాగం హిమోగ్లోబినోపతిస్​తో బాధపడుతున్న పిల్లలు, యువకులకు సంపూర్ణ సంరక్షణ అందిస్తుంది. ఈ పిల్లల ప్రత్యేక అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి చికిత్స చేయడం, రోగనిర్ధారణ నుంచి కోలుకోవడం ద్వారా వారికి సమగ్రమైన, కారుణ్య సంరక్షణ అందించడం ఈ సంస్థ యొక్క లక్ష్యం.

ఈ కార్యక్రమం గురించి ఆసుపత్రి హెచ్​ఓడీ మరియు క్లినికల్ లీడ్ డాక్టర్ ఎమ్ దీనదయాళన్ మాట్లాడుతూ, "భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలలో తలసేమియా ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా ఉందని పేర్కొన్నారు. జాతీయ సర్వేలు బీటా-తలసేమియా గుర్తించదగిన ప్రాబల్యాన్ని ప్రజలపై చూపుతుందని సూచిస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా క్యారియర్ రేట్లు దాదాపు 3-4%గా అంచనా వేయబడ్డాయి. నిర్దిష్ట కమ్యూనిటీలలో, ప్రత్యేకించి అధిక రక్తసంబంధం ఉన్నవారు లేదా గిరిజన జనాభాలో ఇది 17% వరకు పెరుగే అవాశం ఉందని వెల్లడించారు.

మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి - అది "మంకీపాక్స్" కావొచ్చు! - Monkeypox Symptoms

తలసేమియా అనేది పుట్టినప్పటి నుంచి రెండేళ్లలోపు వచ్చే వ్యాధి అని, దీనితో భారతదేశంలో ఏటా దాదాపు 15000 మంది పిల్లలు పుడుతున్నారని ఎంజీఎం క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ఆంకాలజీ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఏ రాజా తెలిపారు. ఇది వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో తలసేమియా కేసులు భారతదేశంలో ఉన్న మన దేశంలోనే ఉన్నాయని అన్నారు. ఎముక మజ్జ మార్పిడి ద్వారానే తలసేమియాను నివారించవచ్చని తెలిపారు. ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాధి బారిన పడిన అనేక మంది పిల్లలకు ఈ చికిత్సను అందించడానికి సిద్దంగా ఉందని వెల్లడించారు. ఆసుపత్రి శాశ్వత నివారణను అందించడం ద్వారా వ్యాధితో బాధపడుతున్న పిల్లల జీవితాలను మార్చడానికి సహాయపడుతుందని తెలిపారు. తలసేమియాతో పాటు, ఈ కార్యక్రమం ఇతర చిన్ననాటి క్యాన్సర్‌లు మరియు రక్త రుగ్మతలకు దాని స్క్రీనింగ్ ప్రయత్నాలను విస్తరింపజేస్తుందని తెలిపారు. అవసరమైన వారికి ముందస్తుగా గుర్తించి చికిత్స అందేలా చేస్తుందని అన్నారు.

అలర్ట్ : షుగర్, గుండె పోటు, ఊబకాయం - ఇవి​ రావడానికి కారణం తెలిసిపోయింది! - Trans Fats Foods List

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.