ETV Bharat / state

గుడ్​న్యూస్​ - ఎల్బీ నగర్‌ టు హయత్‌నగర్ మెట్రోకు లైన్ క్లియర్ - lb nagar To hayathnagar Metro - LB NAGAR TO HAYATHNAGAR METRO

LB Nagar To Hayathnagar Metro Train : హైదరాబాద్​లో హయత్‌నగర్ నుంచి ఐటీ కారిడార్, నగర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్​న్యూస్. ఎల్బీ నగర్ నుంచి హయత్​నగర్ వరకు మెట్రో రైలు మార్గం సుగమమైంది. ఈ మార్గంలో 7 కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు ఉండనున్నాయి.

LB Nagar To Hayathnagar Metro Train
LB Nagar To Hayathnagar Metro Train (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 12, 2024, 8:08 AM IST

LB Nagar To Hayathnagar Metro Expansion : హయత్‌నగర్ నుంచి నిత్యం వేలాది మంది నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు, ఐటీ కారిడార్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. వాళ్లు నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలి అన్నా బస్సు, ఆటోలోనే వెళ్లాలి. లేదా ఎల్బీ నగర్‌ వరకు వచ్చి అక్కడి నుంచి మెట్రో వెళ్లాల్సి వస్తుంది. హయత్‌నగర్‌ నుంచి ఎల్బీ నగర్‌కు రావాలన్నా చాలా సమయం పడుతుంది. కారణం ట్రాఫిక్‌. నగరంలోకి రావాలంటే గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తోంది. అలాంటి వారికి శుభవార్త. ఎందుకంటే మెట్రో రాకతో వారి ప్రయాణం సులభతరం కానుంది. హయత్‌నగర్‌ నుంచి ఐటీ కారిడార్‌ వరకు మెట్రో అనుసంధానం ఏర్పడనుంది.

హైదరాబాద్‌లో మెట్రోరైలు రెండో దశలో ప్రతిపాదిత ఎల్బీనగర్ - హయత్‌నగర్‌ మార్గంలో 6 స్టేషన్లు రాబోతున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటరుకు కాస్త అటుఇటుగా ఒక స్టేషన్‌ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్నా కారణంగా మెట్లో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపున్నా మెట్రో స్టేషన్‌కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్‌ రూపకల్పనకు జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రోరైలు అధికారులు ఫైనల్‌ మ్యాప్‌ ఇచ్చారు.

ఎల్బీ నగర్‌ టు హయత్‌నగర్ మెట్రో
ఎల్బీ నగర్‌ టు హయత్‌నగర్ మెట్రో (ETV Bharat)

మెట్రో విస్తరణకు కసరత్తు - సవాల్​గా మారబోతున్న రెండోదశ కారిడార్‌ - HYD Metro Phase 2 Alignment

  • హైదరాబాద్‌లో మెట్రోరైలు రెండోదశలో వేర్వేరు మార్గాల్లో 70 కి.మీ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. డీపీఆర్ పనులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇందులో ఎల్బీ నగర్‌ హయత్‌నగర్‌ రూట్‌ ఒకటి. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ఉన్న కారిడార్‌-1కు ఈ మార్గం పొడిగింపు.
  • ఈ మార్గంలో చింతల్‌కుంట దగ్గర ఒక స్టేషన్ రానుంది. ఎల్బీనగర్ నుంచి చింతల్‌కుంట వరకు సెంట్రల్‌ మీడియన్‌లోనే మెట్రోరైలు రూట్ ఉంటుంది. మిగతా 5 స్టేషన్లు ఎక్కడెక్కడా అనే వివరాలపై ఇంక స్పష్టత రావాల్సి ఉంది.
  • చింతల్‌కుంట నుంచి హయత్‌నగర్‌ మధ్య పలు ప్రాంతాల్లో జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఈ కారణంగా ఎడమవైపు సర్వీస్‌ రోడ్డులో మెట్రోరైలు మారంగా వస్తుందని మెట్రో అధికారులు వెల్లడించారు.

ముందు రైలు ఎక్కండి దిగాకే టికెట్ కొనండి - మెట్రోలో ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌! - OPEN LOOP TICKETING IN HYD METRO

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.