ETV Bharat / state

రాగల మూడు రోజుల్లో వర్షాలు-ఎక్కడెక్కడ ఎలాంటి వాతావరణం ఉందంటే? - Meteorological Analysis

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 3:01 PM IST

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక ప్రకటన వెలువడింది. రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి బుతుపవనాలు జోరందుకుంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Weather Forecast
Weather Forecast (ETV Bharat)

Meteorological Analysis : అన్నదాలకు వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. వచ్చే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలంతటా వర్షాలు విస్తరిస్తాయని తెలిపింది. మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, హెచ్చరికలుపై వాతావరణ కేంద్రం బులెటిన్‌ ఇచ్చింది.
నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి ఈరోజ తెలంగాణలోని మెదక్ నుంచిభద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంటర్ అవుతుంది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలుకూడా తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అంతా విస్తరిస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. నైరుతి ఋతుపవనాలు రాబోయే 3 నుండి 4 రోజులలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను పూర్తిగా చల్లబరచనుంది. నిన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం, ఈరోజు రాయలసీమ పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. ఎత్తులో కొనసాగుతుంది.
Weather Forecast: ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు చాలా చోట్ల, రేపు, ఎల్లుండి ఎక్కువ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం వుంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులు ఎక్కువగా ఉండనున్నాయి. చెట్లు, కరెంట్‌ స్తంబాలు నేలకూలే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చిరించింది.
weather warnings: ఈరోజు తెలంగాణలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.