ETV Bharat / state

ఏలూరులో వైద్య విద్యార్థి వీరంగం - కత్తితో దాడి - Medical Student Attack - MEDICAL STUDENT ATTACK

Medical Student Attack With Knife at Eluru: వైద్య విద్యార్థి ఇద్దరిపై కత్తితో దాడికి దిగి వీరంగం సృష్టించాడు. ద్విచక్ర వాహనంపై వెళుతున్న చాణక్య పక్కనే కారు డ్రైవరు హారన్ కొట్టుకుంటూ వెళుతున్నాడు. కోపంతో ఊగిపోయిన చాణక్య కారు ఆపి తన బ్యాగులో ఉన్న చాకును తీసి కారు నడుపుతున్న వ్యక్తి పై దాడికి పాల్పడ్డాడు.

Medical_Student_Attack_With_Knife_at_Eluru

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 5:22 PM IST

Medical Student Attack on Public With Knife in Eluru : చేతిలో కత్తి ఉందని అన్నింటికి కత్తితో సమాధానం చెప్పుకుంటూ పోతున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఎవరైనా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా, చెప్పింది వినకపోయినా మారు మాట్లాడడు. కత్తితో దాడికి (Knife Attack) దిగుతాడు అంతే. ప్రాణం పోయటం కష్టం కానీ తీయడం సులువే అన్న విషయం వైద్య విద్యార్థిగా తెలిసి కూడా అజ్ఞానిలా వ్యవహరిస్తున్నాడు. మద్యం మత్తు, ఆపై అహంకారం. దీంతో కనీసం ఏం చేస్తున్నాడనే విచక్షణ లేకుండా వరుస దాడులకు పాల్పడుతూ ఏలూరులో వీరంగం సృష్టించాడు ఓ వైద్య విద్యార్థి. ఒక రోజు వ్యవధిలో చాకుతో ఇద్దరిపై దాడి చేసి చివరకు కటకటాల పాలయ్యాడు.

ఏలూరులో వైద్య విద్యార్థి వీరంగం - కత్తితో దాడి

అక్కయ్యపాలెం సాయిబాబా గుడిలో కత్తితో వ్యక్తి హడావుడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన చాణక్య విదేశాల్లో వైద్య విద్య చదువుతూ ఇటీవలే ఇంటికి వచ్చాడు. బుధవారం ఏలూరు డీ మార్ట్​ వద్ద కారు డ్రైవర్‌ హారన్‌ కొట్టుకుంటూ వెళుతుండగా పక్కన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చాణక్య కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే చాణక్య కారు ఆపి తన బ్యాగులోని చాకును తీసి డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి చేతులు కోసుకుపోగా ఒక వేలు తెగింది. స్థానికులు చాణక్యను పట్టుకుని టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో నిందితుడు పోలీసులపైనా తిరగబడ్డాడు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చిరాకు తెప్పించిన కుక్క... కత్తితో బాలుడు హల్​చల్​

ముందే అరెస్టు చేసి ఉంటే ప్రమాదం తప్పేది: ఇదిలా ఉండగా గతంలో చాణక్య ఉండే ఇంటి పక్కనున్న ఇంట్లో నగర శివారు జాలిపూడికి చెందిన కార్పెంటర్‌ దుర్గా సురేష్‌ వడ్రంగి పని చేసేవాడు. మిషన్‌ శబ్దం రావడంతో ఆగ్రహించిన చాణక్య అక్కడికి వెళ్లి కార్పెంటర్‌ను హెచ్చరించాడు. మిషన్‌ శబ్దం వస్తోందని, శబ్దం రాకుండా పని చేయాలని చాణక్య చెప్పాడు. దానికి కార్పెంటర్ యంత్రం శబ్ధం వస్తుందని ప్రతిగా చెప్పటంతో ఆగ్రహించిన చాణక్య తన వద్దనున్న చాకుతో కార్పెంటర్‌ చేతులు, వీపుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయాలు పాలైన కార్పెంటర్‌ను స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై స్థానికలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం అతను మళ్లీ దాడికి పాల్పడ్డాడని, అప్పుడే అరెస్టు చేసి ఉంటే ఇలా జరిగేది కాదని కొందరు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు చాణక్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కక్ష కట్టి భార్యపై దాడి చేయబోయాడు.. కానీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.