Medaram Hundi Calculation 2024 : మేడారం మహాజాతర విజయవంతంగా ముగిసింది. కోటికి పైగా భక్తులు జాతర సమయంలో భక్తి శ్రద్థలతో అమ్మవార్లను దర్శించుకుని హుండీలో కానుకగా నగదు, ఆభరణాలు సమర్పించారు. నిన్నటితో తిరుగువారం కూడా ఘనంగా ముగియడంతో అధికారులు హుండీ లెక్కింపుపై దృష్టి సారించారు. తొలిరోజు లెక్కింపులో రూ.3.15 కోట్లు వచ్చింది. 134 హుండీలు దేవాదాయ అధికారులు లెక్కించారు. అనంతరం హుండీ ఆదాయాన్ని బ్యాంకు సిబ్బందికి అందజేశారు.
పోలీసుల పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల నడుమ హనుమకొండలోని టీటీడీ (TTD) కల్యాణ మండపంలో పూజలు నిర్వహించి అనంతరం హుండీ లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 518 హుండీల సీలు తీసి లెక్కింపు ప్రారంభించారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారుల పర్యవేక్షణలో 350 మంది సిబ్బంది, స్వచ్చంద సేవా సంస్ధల కార్యకర్తలు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
విద్యుత్ దీప కాంతుల్లో మేడారం - కనువిందుగా డ్రోన్ దృశ్యాలు
"నాలుగు రోజుల మహా జాతర పూర్తైనా తర్వాత 518 హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కించడం ఇవాళ ప్రారంభం అయ్యింది. దీనికి సంబంధించి ములుగు జిల్లా అధికార యంత్రాంగం, ఆర్డీవో, ఆలయ సిబ్బంది, పోలీసుల సమక్షంలో లెక్కింపు ప్రారంభించాం. హుండీలో డబ్బుతో పాటు ఒడి బియ్యం వస్తుంది. బియ్యాన్ని వేరు చేయడానికి ఈ సారి నూతన యంత్రాలు తెప్పించాం."-సునీత, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్
Medaram Hundi Counting 2024 : ఈ లెక్కింపులో ప్రయోగాత్మకంగా చిల్లర నాణేల లెక్కింపు కోసం ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. లెక్కింపులో భాగంగా జాతర చివరి రోజు తేలికపాటి వర్షం కారణంగా కొన్ని నోట్లు తడిసిపోయాయి. వాటిని వేరు చేసి ఆరబెట్టారు. 500 రూపాయల నోట్ల కట్టలు, అంబేడ్కర్ ఫొటోతో ముద్రించిన నకిలీ కరెన్సీ నోట్లతో పాటు విదేశీ కరెన్సీ నోట్లు హుండీలో లెక్కింపులో లభ్యమైయ్యాయి. వాటితో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా భక్తులు అధికంగా కానుకగా సమర్పించారు. వీటిని ప్రత్యేకంగా అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు చేయనున్నారు.
ముగింపు దశకు మేడారం మహా జాతర - నేడు వనప్రవేశం చేయనున్న దేవతలు
గత మూడు జాతరలో పరిశీలిస్తే : 2018 సంవత్సరంలో 8 కోట్ల 14 లక్షల, 6 వేల 603. 2020 లో 9కోట్ల 87 లక్షల 24 వేల 663 రూపాయల ఆదాయం హుండీల ద్వారా రాగా రెండేళ్ల క్రితం జరిగిన జాతరలో 12 కోట్ల 45 లక్షల 49 వేల 727 రూపాయల ఆదాయం సమకూరింది. మేడారం (Medaram Jatara)మహా జాతరకు ఈ సారి భక్తులు భారీగా పోటెత్తారు. నెల పదిహేను రోజుల ముందు నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి విచ్చేశారు. కోటీ 40 లక్షలపైన భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. దీంతో ఈసారి ఆదాయం కూడా బాగా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
గిరిజన దేవతల దర్శనం కోసం ఛత్తీస్‌గఢ్‌లోని ఆ ఊరంతా తరలివచ్చింది