ETV Bharat / state

పోచారం ఐటీకారిడార్​లో భారీ చోరీ - రూ.2 కోట్లు సహా 28 తులాల బంగారం స్వాహా - Massive Theft in Medchal District - MASSIVE THEFT IN MEDCHAL DISTRICT

Massive Theft in Medchal District : మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధిలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. మక్త గ్రామంలో నాగభూషణ్ అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టి రూ.2 కోట్లు, 28 తులాల బంగారంను చోరీ చేశారు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Massive Theft in Medchal District
Massive Theft in Medchal District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 10:24 AM IST

Updated : Sep 22, 2024, 11:51 AM IST

Massive Theft in Medchal District : వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా రెండు కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొట్టారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. చౌదరిగూడలోని మక్త గ్రామంలోని నాగభూషణం అనే వ్యక్తికి చెందిన ఇంటి‌ తాళం‌ పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలో భద్రపరిచిన రూ.2 కోట్ల 2 లక్షలతో పాటు 28 తులాలు బంగారు నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దొంగతనం గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నాగభూషణం శంకర్‌పల్లిలో 10 ఎకరాల భూమి విక్రయానికి ఒప్పందం చేసుకున్నాడని, అడ్వాన్స్‌గా ఇచ్చిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే నాగభూషణం డ్రైవర్‌పై అనుమానంతో అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కన్నేస్తాడు - గెటప్​ మార్చేస్తాడు - ఆపై కొట్టేస్తాడు - తర్వాత ఎంచక్కా! - Gold theft in hyderabad

దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందన్న దొంగ - కడుపు నిండా తినిపించి మరీ! - Nalgonda Theft Viral Video

Last Updated : Sep 22, 2024, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.