ETV Bharat / state

ఆ ఊరే సంథింగ్ స్పెషల్- ఇళ్లపై కార్లు,హెలికాప్టర్లు! - Attractive Water Tanks - ATTRACTIVE WATER TANKS

Attractive Water Tanks in Sangareddy : ఆ ఊర్లో ఇళ్లపై కార్లు, హెలికాప్టర్లను మనం చూడొచ్చు. అదేంటీ అనుకుంటన్నారా? మీ అనుమానం కరెక్టేనండోయ్! ప్రతి ఒక్కరు ఇన్నోవేషన్‌గా ఆలోచించాలన్న దానికి ఆ ఊరు ప్రజలు ఆదర్శంగా నిలిచారని చెపొచ్చు. ఇంతకీ ఏంటా వినూత్న ఆలోచనలు, ఆ వాహనాల సంగతేంటో తెలుసుకోవాలంటే తొందరగా కథలోకి ఎంటరైపోవాలంతే!

attractive_water_tanks_in_sangareddy
attractive_water_tanks_in_sangareddy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 5:30 PM IST

Impressive Cars and Helicopter Water Tanks : తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది. పట్టణానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో నిత్యం జనం వస్తుంటారు. ఇక్కడ పని చేసే తాపీ మేస్త్రీలు ఎక్కువే. పేరుకే కాదు విభిన్న రీతుల్లో ఆకృతులను చేపట్టి తమదైన ముద్రను వేస్తుంటారు. ఇళ్లపై కారు, హెలికాప్టర్‌, చైనాలోని నిర్మాణ ఆకృతులను పోలిన నీటి ట్యాంకులను రూపొందించి చూపరులను ఆకట్టుకుంటున్నారు. నిజమైన కారు ఇంటిపైకి ఎలా ఎక్కిందా, ఇంత చిన్న స్థలంలో హెలికాప్టర్‌ ఎలా దిగిందనే సందేహం స్థానికుల్లో కలిగేలా చేసి అబ్బురపరిచేలా నిర్మాణాలు చేపడుతున్నారు.

ఆయా ప్రాంతాల్లో తమ ఇంటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ఈ కళాఖండాలను ఇంటిపై నిర్మించుకున్నామని యజమానులు చెబుతున్నారు. ఫలానా వారి ఇల్లు ఎక్కడ అనగానే ఇంటిపై కారు ఉంది. ఇంటిపై హెలికాప్టర్‌ ఉందనే లాండ్‌ మార్క్‌ని చూపడానికే ఇలా వివిధ ఆకృతులు చేయించుకున్నట్లు యజమానులు చెబుతున్నారు. వారు చేసే వృత్తి అనుగుణంగా తగిన గుర్తింపు ఉండాలని ఖర్చు ఎక్కువైనా వివిధ ఆకృతుల్లో నీటి ట్యాంకులను ఏర్పాటు చేయించుకున్నారు. వానకు తడిచి, ఎండకు ఎండటంతో కొంత మేర రంగు వెలిచిపోవడంతో ఏయేటికాయేడు రంగులను వేస్తూ వాటి అందాన్ని కాపాడుతున్నారు.

అరె విమానం... కాదుకాదు... తరగతి గదే

మట్టిలో మాణిక్యాలుగా తాపీ మేస్త్రీలు : జహిరాబాద్‌లోని బసవనగర్‌ కాలనీ, దత్తగిరి కాలనీల్లో ఈ వినూత్న ఆవిష్కరణలు దర్శనమిస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసి యజమానులు ఇంటి పైకప్పుల్లో నీటి ట్యాంకులను విభిన్నంగా నిర్మించుకున్నారు. అందరిలో ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నీటి ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒక్కో నిర్మాణానికి దాదాపు నెల రోజులు తాపీ మేస్త్రీలు తమ ప్రతిభ కనబరిచి తయారు చేశారు. వారికి ఉన్న ప్యాషనే ఈరోజు అద్భుత కళాఖండాలకు అద్దం పడుతోంది.

కళ ఒకరి సొంతం కాదని నిరూపిస్తున్నారు ఈ మేస్త్రీలు. కళకు తగిన ఫలితం కూడా లభించడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. యజమానులు పట్టణంలో తమదైన ముద్ర వేసుకున్నారు. మట్టిలో మాణిక్యాలు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు ఈ తాపీ మేస్త్రీలు. కళ ఒక రంగానికే పరిమితం కాదని నిరూపిస్తున్నారు. ఆయా రంగాల్లో ఆయా ప్రావీణ్యం కలిగిన పనిమంతులు కూడా ఉన్నారు. వారిని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తే, మరిన్ని అద్భుతాలు బయటకు వస్తాయనడంలో సందేహం లేదు.

Container Mobile House: 'కంటైనర్‌ మొబైల్‌ హౌస్‌'.. వసతులు అదుర్స్​

ఆటో రిక్షాతో 'మొబైల్​ హౌస్'​.. మహీంద్రా ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.