ETV Bharat / state

అన్ని రంగాల్లో మహిళా సాధికారత మరింత పెరగాలి : శైలజా కిరణ్ - Margadarsi MD Sailaja Kiron

Womens Day Celebrations in Hyderabad : విజయానికి దగ్గరి దారి ఉండదని, ప్రతి క్షణం కష్టపడటం ఒక్కటే మార్గమని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్(FTCCI) ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

Etv Bharat
Womens Day Celebrations in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 10:07 PM IST

అన్ని రంగాల్లో మహిళల సాధికారత మరింత పెరగాలి శైలజా కిరణ్

Womens Day Celebrations in Hyderabad : మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని, అన్ని రంగాల్లో మహిళల సాధికారత మరింత పెరగాలని మార్గదర్శి చిట్​ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్(Margadarsi MD Sailaja Kiron) పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్(FTCCI) ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో శైలజా కిరణ్ పాల్గొన్నారు.

Sailaja Kiron on Women Empowerment : ఈ సందర్భంగా మాట్లాడిన శైలజా కిరణ్, మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, తమకు అభిరుచి ఉన్న రంగాల్లో అడుగేయాలని శైలజా కిరణ్ పేర్కొన్నారు. తన దృష్టిలో గృహిణి బాధ్యత అంటే చాలా సవాల్​తో కూడుకున్నదని తెలిపారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఇంటిపనులు నిర్వహిస్తూ విరామం లేకుండా శ్రమిస్తారని పేర్కొన్నారు. గృహిణి బాధ్యతను నిర్వహించాలంటే చాలా ఓపిక అవసరమని, అంతలా శ్రమించినప్పటికీ తగిన గుర్తింపు రావడం లేదన్నారు.

మార్గదర్శిని 10వేల కోట్ల రూపాయల టర్నోవర్​కి తీసుకువచ్చేందుకు చేసిన కృషి గురించి పంచుకున్నారు. రోజు 14 గంటలు పని చేస్తానని పేర్కొన్న శైలజా కిరణ్, తన ప్రయాణంలో భర్త, అత్తమామల సహకారం మరువలేనిదన్నారు. చిట్ ఫండ్ చట్టాలకు లోబడే మార్గదర్శి నిర్వహిస్తునట్టు పేర్కొన్నారు. అయితే మీడియా సంస్థ నిర్వహిస్తూ, ప్రజల పక్షాన నిలబడిన కారణంగా మార్గదర్శి రెండు సార్లు రాజకీయ పగను చవి చూసిందని అభిప్రాయపడ్డారు.

మహిళ సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలని రీజనల్ పాస్​పోర్టు అధికారిణి స్నేహజ జొన్నలగడ్డ(Sneha Jonnalagadda) పేర్కొన్నారు. ఇంట్లో లింగవివక్ష చూపకుండా, పిల్లలను పెంచాలన్నారు. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ఈ వేడుకల్లో ఎఫ్​టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయదేవ్, జిల్లా వెల్ఫేర్ అధికారిణి మోతి, రీజనల్ పాస్ పోర్ట్ అధికారిణి స్నేహజ జొన్నలగడ్డ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

విజయానికి దగ్గరి దారి ఉండదు. ప్రతి క్షణం కష్టపడటం ఒక్కటే మార్గం. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ లేదు. నా ప్రయాణంలో కుటుంబసభ్యుల సహకారం మరువలేనిది. నా దృష్టిలో గృహిణి బాధ్యత అంటే చాలా సవాల్​తో కూడుకున్నది. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఇంటిపనులు నిర్వహిస్తూ విరామం లేకుండా శ్రమిస్తారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, తమకు అభిరుచి ఉన్న రంగాల్లో అడుగేయాలి. అన్ని రంగాల్లో మహిళల సాధికారత మరింత పెరగాలి. - శైలజా కిరణ్, మార్గదర్శి ఎండీ

జగిత్యాల, సూర్యాపేటలో మార్గదర్శి నూతన శాఖల ప్రారంభం

హైదరాబాద్ ఆర్​పీఓగా జొన్నలగడ్డ స్నేహజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.