ETV Bharat / state

చెట్టెక్కితేనే ఆ గూడేనికి చేరుకోవొచ్చు- ఏళ్ల తరబడి గిరిజనుల సాహసం - Tribals Suffering With Floods

Manyam Tribals Suffering With Floods Due No Raod Facility : ఓ వైపు అపారమైన అభివృద్ధి, మరో వైపు కనీస వసతులు లేక సతమతమవుతున్న సాధారణ ప్రజలు. ఈ హై టెక్​ యుగంలో కనీసం ఇల్లు చేరడానికి గిరిపుత్రులు ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిన దుస్థితి.

manyam_tribals_suffering_with_floods_due_no_raod_facility
manyam_tribals_suffering_with_floods_due_no_raod_facility (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 2:31 PM IST

Updated : Jul 22, 2024, 3:34 PM IST

Manyam Tribals Suffering With Floods Due No Raod Facility : ఆకాశంలో జుమ్మంటూ అధునాతన విమానాలతో దూసుకెళ్తున్న రోజులివి. కానీ మన్యంలో మాత్రం కనీసం రోడ్లు లేవు. వంతెన ఊసే లేదు. వర్షాకాలం వచ్చిందంటే అంతే సంగతి. మట్టి రోడ్లు కూడా కొట్టుకుపోయి దారి కనిపించదు. గూడేనికి చేరుకోవాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎలా అయినా ఇంటికి చేరుకోవాలని గిరిపుత్రులు చెట్టుకు తాడు కట్టి పెద్ద ఎత్తున పొంగుతున్న వాగులో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు.

Tribes Built Bridge With Sticks in Middle of the Streams : ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన గ్రామాల పరిస్థితి మారడం లేదు. ఇంత అభివృద్ధి చెందుతున్న కాలంలోనూ గిరిశిఖర గ్రామాలకు కనీసం రోడ్లు లేవు. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్లేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీలో సుమారు 800మంది జీవిస్తున్నారు. గొల్లబంధ, గంగవరం, నీలవరం, తీగేలామెట్ట, యర్రగొండ, మర్రిపాకాల, పాలసముద్రం, జెర్రీగొంది, రెమలపాలెం, బొద్దుమామిడికి చేరుకోవాలంటే పలకజీడి నుంచి వాగు దాటాల్సిందే. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు సాహసం చేయాల్సిందే.

కొనసాగుతున్న వరద - వణికిపోతున్న గోదావరి పరివాహక ప్రాంతాలు - Rains Effect in Joint East Godavari

ఏరు దాటేందుకు గిరిజనులు ఆలోచనకు పదునుపెట్టారు. ఆ ఏటి గట్టు నుంచి ఇటువైపు వచ్చేందుకు చెట్లకు తాడు కట్టారు. పొంగుతున్న వాగు ప్రవాహంలో తాడు పట్టుకుని వేలాడుతూ ఒక్కొక్కరు ఒడ్డుకి చేరుతున్నారు. ప్రాణాలకు తెగించి వాగు దాటుతూ గూటికి చేరుకుంటున్నారు.

No Roads in Manayam Tribal Areas : ఆ ప్రాంతంలో రెండు గడ్డలు ఉన్నాయి. వాటిని దాటేందుకు వంతెన నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే లేడు. గిరిజనులే వాగుల మధ్యలో కర్రలతో వంతెన వేసుకున్నారు. గొట్టెలపాడు గడ్డ వద్ద వర్షాలకు భారీ వృక్షం అడ్డంగా పడింది. ఉల్లిగడ్డ, కంపు మామిడి గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వాలు ఎలానో వంతెనలు కట్టలేదు ప్రకృతి అయినా కరుణించింది అంటూ చెట్టునే వంతెనగా మార్చుకున్నారు. తడిచిన చెట్టు పట్టుకుని దాటుతున్నారు. ఇప్పటికైనా వంతెన నిర్మించాలని గిరిపుత్రులు కోరుతున్నారు.

అల్లూరి జిల్లాలో వరద బీభత్సం- ప్రమాదకరంగా జలాశయాలు - RAIN EFFECT IN ALLURI DISTRICT

Last Updated : Jul 22, 2024, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.